యుద్దం వార్తలతో నష్టాపోయిన మార్కెట్లు.. 8650 పాయింట్ల దిగువన నిఫ్టీ Sensex dives 465 points on LoC turmoil; Nifty below 8650

Sensex dives 465 points on loc turmoil nifty below 8650

sensex, nifty, indian share market, indian stock exchange, Tata Consultancy Services, infosys, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve

Stocks reeled under huge losses on Thursday as benchmark Sensex plunged sharply by over 465 points, the biggest single-day fall in three months

యుద్దం వార్తలతో నష్టాపోయిన మార్కెట్లు.. 8650 పాయింట్ల దిగువన నిఫ్టీ

Posted: 09/29/2016 06:59 PM IST
Sensex dives 465 points on loc turmoil nifty below 8650

పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసిందంటూ భారత సైన్యం ప్రతినిధి చెప్పిన కొద్ది సేపటికే.. మిడ్ సెషన్‌లో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. డీజీఎమ్ఓ వ్యాఖ్యల అనంతరం దేశీయ సూచీలు గురువారం మధ్యాహ్నం సెషన్లో భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 573 పాయింట్లు పడిపోయి,28వేల దిగువకు 27,719 వద్దకు వచ్చి చేరింది. రియాల్టీ, హెల్త్ కేర్, పవర్, మెటల్ వంటి అన్ని రంగాల షేర్లు దాదాపు 5.05 శాతం పతనమయ్యాయి.

అదేవిధంగా నిఫ్టీ సైతం 186.90 పాయింట్ల నష్టపోయి, 86వేల దిగువకు 8,558.25గా నమోదైంది. గత మూడు నెలల కాలంలో తొలిసారిగా మార్కెట్ ఇంతటి భారీ పతనాన్ని చవిచూసింది. గతంలో బ్రెగ్జిట్ సమయం తరువాత అంతటి పతనాన్ని మార్కెట్ ఇప్పుడు ఎదుర్కోంది, ఈ భారీ పతనానికి ప్రధాన కారణం పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు జరిపిందేననే డీజీఎమ్ఓ కామెంట్లేనని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు.
 
నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల లాంచ్‌పాడ్లపై భారత సైన్యం గత రాత్రి సునిశిత దాడులు చేసిందనే వార్త నేపథ్యంలో దేశీయ మార్కెట్ల సెంటిమెంట్కు తీవ్రంగా దెబ్బతీసింది. ఒక్కసారిగా అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. దీంతో చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 465 పాయింట్ల తగ్గుదలతో 27,828 పాయింట్ల వద్ద ముగిసింది. ఆగస్టు 26 తర్వాత ఇదే కనిష్ట ముగింపు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా ఇదే బాటలో 154 పాయింట్లు పతనమై (1.76 శాతం) 8,591 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, లుపిన్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, గెయిల్, ఎస్బీఐ, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, లార్సెన్ అండ్ టుబ్రో, ఆసియన్ పేయింట్స్ నష్టాల బాట పట్టాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles