లాభాలబాటలో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా నష్టాలలోకి జారుకున్నాయి. మార్కెట్ దారుల అంచనాలకు చెక్ పెడుతూ ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని మానిటరింగ్ కమిటీ తీసుకన్న నిర్ణయంతో లాభాల్లో పురోగమించిన మార్కట్లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకుని వరుసగా రెండు రోజుల సాధించిన లాభాలను కోల్పోయాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం వెలువరించే మొదటిపాలసీపై భారీగా ఆశలు పెట్టుకున్న రేట్ సెన్సిటివ్ రంగాల షేర్లకు ఆర్బీఐ నిర్ణయంతో షాకిచ్చింది.
కీలక వడ్డీరేట్లు రెపోను, రివర్స్ రెపోను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించడంతో ఆ రంగాల షేర్లన్నీ కుప్పకూలాయి. ముఖ్యంగా బ్యాంకు షేర్లలో కొనసాగుతున్న లాభాలన్నీ ఈ ప్రకటనతో తుడిచిపెట్టుకుపోయాయి. ఆర్బీఐ పాలసీ ప్రకటన ముందు వరకు లాభాల్లో నడిచిన కెనరా బ్యాంకు, ఐడిబీఐ, ఓబీసీ, పీఎన్బీ, కొటక్ మహింద్రా, సిండికేట్, యూనియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, ఎస్బీఐలు నష్టాల్లోకి జారుకున్నాయి. వీటిలో అత్యధికంగా బ్యాంకు ఆఫ్ బరోడా, ఎస్బీఐలు పడిపోయాయి. దీంతో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 1 శాతం క్షీణించి 17,953 పాయింట్లకు దిగజారింది..
ఉదయం ప్రారంభం నుంచి మార్కెట్లు లాభాలలో దూసుకెళ్లిన మార్కెట్లు ఆ తరువాత తిరోగమనం బాటపట్టాయి. సెన్సెక్స్ ప్రారంభంలో 300 పాయింట్లకు పైగా ర్యాలీ జరిపింది. నిఫ్టీ సైతం 8200 స్థాయిని పునరుద్ధరించుకుని ట్రేడ్ అయింది. అయితే అందివచ్చిన లాభాలను అధిమిపట్టుకోవడంలో విఫలమైన మార్కెట్లు చివరకు తటస్థంగా ముగిసాయి. ఇక ముగింపు సమయానికి సెన్సెక్స్ స్వల్పంగా 6 పాయింట్లు నష్టంతో 26 వేల 299 పాయింట్ల వద్దకు చేరుకోగా, అటు నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 8వేల 112 పాయింట్ల వద్ద ముగిసి.. కీలకమైన 8100 మార్కుకు ఎగువకు చేరుకుంది.
ఈ నేపథ్యంలో అటో రంగం ర్యాలీని కొనసాగించింది. అటో రంగంపై, అర్బీఐ వడ్డీ రేట్ల ప్రభావం నామమాత్రంగానే వుంది. అయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, కన్జూమర్ డూరబుల్స్ సూచీలు లాభాలను అర్జిచాయి. కాగా బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీ హెల్త్ కేర్ సూచీలు మాత్రం భారీగా దెబ్బతిన్నాయి, దీంతో పాటు క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంజీసీ, ఐటీ, టెక్నాలజీ, చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రామల సమాఖ్యలు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి.
ఈ క్రమంలో ఏషియర్ మోటార్స్, బిపిసీఎల్; అదాని పోర్ట్స్, హెచ్ డీ ఎఫ్ సీ, ఐడియా సెల్యూలార్ తదితర సంస్థల షేర్లు అధిక లాభాలను ఆర్జించగా, సన్ ఫార్మ, బ్యాంక్ అప్ బరోడా, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more