దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడు రోజు పాటు ఎదుర్కోన్న నష్టాలకు ఇవాళ్టి ముగింపుతో అందిన స్వల్ప లాభాలతో బ్రేకులు పడ్డాయి. వరుసగా గత ఏడు రోజుల నుండి తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్న మార్కెట్లు ఏకంగా 718 పాయింట్లను కొల్పయి నాలుగు వారాల కనిష్ట స్థాయికి చేరగా వారంతమైన ఇవాళ అందిన స్వల్ప లాభాలు దేశీయ సూచీలకు ఊపునందించాయి. విదేశీ మదపుదారులు అమ్మకాల ఒత్తడి నేపథ్యంలో ఇవాళ మార్కెట్లు నష్టాలను ఎదుర్కోన్నాయి.
ఇవాళ ఉదయం కూడా మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ జరిగనంత సమయం లాభనష్టాల మధ్య ఊగిసలాడి తీవ్ర ఒడిదోడుకులకు లోనయ్యాయి. మార్కెట్లకు ఇవాళ స్వల్ప లాభాలు అందినా.. కీలకమైన మార్కులను అందుకోవడంలో మాత్రం సూచీలు విఫలమయ్యాయి. సెన్సెక్స్ మరోసారి 26వేల పాయింట్ల కీలక స్థాయిలో, నిఫ్టీ 8 వేలకు దిగువన ముగిసింది. ఈ క్రమంలో సెన్సెక్స్ మరోసారి 26వేల పాయింట్ల కీలక స్థాయిలో, నిఫ్టీ 8 వేలకు దిగువన ముగిసింది.
ఈ నేపథ్యంలో కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు లాభాలను ఆర్జించాయి. దివీస్ కు షాక్ నేపథ్యంలో ఫార్మా నష్టపోగా ఐటీ, టెక్నాలజీ షేర్లతో పాటు స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ రంగాలు కూడా నష్టపోయాయి.రోజంతా సెన్సెక్స్ నారో బ్యాండ్ లోట్రేడ్ అయింది. ఈ క్రమంలో సిప్లా, బాష్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, సన్ ఫార్మా సంస్థల షేర్లు లాభాలను అర్జించగా, హెచ్‌సీఎల్ టెక్ యాక్సిస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్ అరబిందో ఫార్మా టెక్ మహీంద్రా తదితర సంస్థల షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more