దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలను అందుకున్నాయి. గత కొన్నాళ్లుగా లాభానష్టాల మధ్య ఉగిసలాడుతూ.. నష్టాలను మూటగట్టుకున్న దేశీయ సూచీలకు ఇవాళ కోంత బలం చేకూరింది. ఉదయం కొంత లాభానష్టాల మధ్య కొట్టుమిట్టాడిన సూచీలు సాయంత్రానికి మంచి లాభాలను అందుకున్నాయి. ఇవాళ్టి లాభాలతో ఏకంగా సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ కూడా కీలకమైన 8 వేల మార్కును అందుకుంది.
ఇవాళ ఉదయం మార్కెట్లు ఆరంభంతోనే లాభాలను అందుకున్నాయి. తొమ్మిది రోజుల కరెక్షన్ అనంతరం ఫార్మా షేర్లు తిరిగి పుంజుకోవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. లాభాల్లో ఎగిసిన కొద్దిసేపటికే మార్కెట్లు మళ్లీ ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. 90 పాయింట్ల లాభంలో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయానికి 9.58 పాయింట్ల లాభంలో 25,816 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నిఫ్టీ సైతం 7,908గా ట్రేడ్ సాగించింది.
గత కొన్ని సెషన్లగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్న మార్కెట్లు లాంట్ టర్మ్ కాపిటల్ లాభాలపై పన్నులుండవన్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ భరోసాతో బౌన్స్ బ్యాక్ అయ్యాయి. దీంతో పదకొండు గంటల నుంచి మంచి ఊపునందుకున్న స్టాక్ మార్కెట్లు ర్యాలీని కొనసాగించాయి. డిసెంబర్ మాసం డెరివెటివ్స్ గడవు రేపటితో ముగుస్తున్న తరుణంలో ఈ మాసం మార్కెట్లకు ఇది మంచి ఊపునందించిదని కూడా మార్కెట్ వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో మార్కెట్లు ముగింపు సమయానికి సెన్సెక్స్ 406 పాయింట్ల లాభంతో 26 వేల 213 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించగా, ఇటు నిఫ్టీ కూడా 8వేల 33 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది. ఈ తరుణంలో ఇవాళ మొత్తంగా 1679 సంస్థల షేర్లు లాభాలను అర్జించగా, 862 సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. కాగా 193 సంస్థల షేర్లు తటస్థంగా వున్నాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ అటో, బ్యాకింగ్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్, మెటల్స్, మధ్యతరహా పరిశ్రమల సమాఖ్యకు సంబంధిచిన సూచీలు భారీ లాభాలను అందుకోగా, మిగిలిన అన్ని సూచీలు కూడా లాభాల బాటలోనే పయనించాయి. ఈ క్రమంలో ఐటీసీ, బాస్చ్, టటా స్టీల్, అరబిందో ఫార్మ, టాటా మోటార్స్ డీజిల్ తదితర సంస్థల షేర్లు అత్యధికంగా లాభాలను అర్జించగా, గెయిల్, గ్రాసిమ్ సంస్థల షేర్లు నష్టాల్లో పయినించాయి
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more