పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం.. అయితే తనదైన ముద్రతో బడ్జెట్ ను రూపోందించడంతో పాటు పారిశ్రామిక ప్రగతికి నిధులను కేటాయించడంతో మదుపరులు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2017-18 ఆర్థిక బడ్జెట్ కు సంపూర్ణ మార్కులను వేశారు. నెగిటివ్ సర్ ప్రైజ్ లు ఏమీ లేని కారణంగా మదుపరులు బడ్జెట్ ను స్వాగతిస్తూ.. అ మేరకు పెట్టుబడులకు అసక్తి కనడబర్చడంతో మార్కెట్లు ఊపందుకుని క్రమంగా లాభాల వైపు పయనించాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి.
ముఖ్యంగా పన్నుచెల్లింపు పరిమితి సగానికి తగ్గించడం, బ్యాంకులకు కొత్త పెట్టబడులు, చౌక గృహాల ప్రాజెక్టులకు ఇన్ఫ్రా హోదా, మౌలిక సదుపాయాల రంగానికి భారీ కేటాయింపులతో అప్పటివరకు స్తబ్దుగా ఉన్నమార్కెట్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్ల భారీ కొనుగోళ్లతో చివరి వరకూ జోరును కొనసాగించిన మళ్లీ మార్కెట్లు బడ్జెట్ రోజు అత్యధిక స్థాయిలో 1.8 శాతం ఎగిశాయి. 2005 నాటి స్థాయిని తాకాయి.
సెన్సెక్స్ 486 పాయింట్లు దూసుకెళ్లి 28,142 వద్ద నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో 8,716 వద్ద ముగిసింది. మరోవైపు అక్టోబర్ 24 తరువాత నిఫ్టీ మళ్లీ 8,700కు ఎగువన ముగియడం విశేషం.ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకులకు రూ. 10,000 కోట్లమేర కొత్త పెట్టుబడులు అందించనున్నట్లు జైట్లీ ప్రకటనతో బ్యాంక్ నిఫ్టీ జోరు పెంచింది. దాదాపు అన్ని బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కాగా 1935 సంస్థల షేర్లు లాభాలలో పయనించగా, 890 సంస్థల షేర్లు నష్టాలలో ముగియగా, 118 సంస్థల షేర్లు తటస్థంగా వున్నాయి.
బాష్ టాప్ విన్నర్ గా, మారుతీ, బీవోబీ, ఐషర్, ఐసీఐసీఐ, ఐటీసీ, హిందాల్కో, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్, స్టేట్‌బ్యాంక్ 5-4 శాతం లాభాల్లో ముగిశాయి. అయితే ఇంత హోరులో కూడా ఐటీ, ఫార్మ సెక్టార్లో బలహీనత కొనసాగడం గమనార్హం. హెచ్ 1బీ వీసాలపై ఆందోళనలతో వరుసగా రెండో రోజు కూడా ఐటీ లో అమ్మకాలు కొనసాగాయి. టీసీఎస్, అరబిందో, ఐడియా, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ, భారతీ, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్ భారీగా నష్టపోయాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more