కస్టమర్లకు మళ్లీ బంఫర్ ఆఫర్ ప్రకటించిన జియో..! Jio free offer: Mukesh Ambani announces new tariff plans

Jio free offer mukesh ambani announces new tariff plans

Mukesh Ambani, Reliance Jio, Jio tariff plans, Jio Prime, Reliance Jio offers, Jio subscribers, Jio data charges, telecom

Reliance Industries Mukesh Ambani said that customers who signed up for Jio on or before March 31 could continue making free voice calls and get 1GB of data free daily at a nominal fee.

కస్టమర్లకు మళ్లీ బంఫర్ ఆఫర్ ప్రకటించిన జియో..!

Posted: 02/21/2017 05:08 PM IST
Jio free offer mukesh ambani announces new tariff plans

టెలికాం రంగంలో సంచ‌ల‌నాలకు తెరతీసిన రిలయన్స్ జియో.. తన ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోంటూ గత నూట డెబ్బై రోజులుగా సెకనుకు ఏడుగురు కస్టమర్లను చేర్చుకుంటూ ముందుకుసాగుతోంది. ఈ క్రమంలో మరో బంఫర్ అఫర్ ఫ్రకటించారు జియో అధినేత ముఖేష్ అంబాని. తాజాగా మ‌రో ఏడాది పాటు తమ ప్రాథమిక సభ్యత్వం పోందిన కస్టమర్లకు మాత్రమే ఈ అరుదైన ప్లాన్ ప్రకటించింది. తమ ప్రాథమిక సభ్యులకు మరో ఏడాది పాటు ఉచిత డేటా, వాయిస్ కాల్ప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ముఖేష్ అంబానీ ఇవాళ సంచలన ప్రకటన చేశారు.

సంవత్సరం పాటు తొంబై తొమ్మిది రూపాయలకే రిలయన్స్ జియోలో ప్రాథమిక సభ్యత్వం అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. మార్చి 31లోపు జియో సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి..ఆ తర్వాత తొంబై తొమ్మిది రూపాయలకే ప్రాధమిక సభ్యుత్వం అందిస్తామన్నారు. ప్రాధమిక సభ్యులుగా ఉన్నవారు వెల్‌కమ్ ఆఫర్ కింద అందిస్తున్న ఆఫర్లను మరో సంవత్సరం పాటు పొందవచ్చునని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 31 తర్వాత మరో సంవత్సరం పాటు నెలకు రూ.303 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

అంబానీ ప్ర‌సంగంలో హైలెట్స్‌

99 రూపాలయకే జియో ప్రైమ్ మెంబర్ షిప్.. మార్చి 1 నుంచి ప్రారంభం
99 రూపాలయకే ఏడాది సభ్యత్వం
రోమింగ్ ఛార్జీలు ఉండ‌వు
ఇత‌ర టెలికాం కంపెనీలు అందిస్తున్న డేటా క‌న్నా 20 శాతం అద‌నంగా డేటాను ఇచ్చే విధంగా ప్ర‌ణాళికను సిద్ధం చేస్తున్నాం – ముఖేష్ అంబానీ
జియో టారిఫ్ ప్లాన్స్ ఏది తీసుకున్నా.. వాయిస్ కాల్స్ జీవితకాలం ఫ్రీ. ఇతర ఏ నెట్ వర్క్ కు చేసినా బిల్లు పడదు
మార్చి 31వ తేదీ వరకు జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కొనసాగుతుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles