Moto E4 Plus will be Flipkart exclusive in India భారతీయ విఫణిలోకి త్వరలో మోటో ఈ4 ప్లస్‌.

Moto e4 plus india launch date announced

moto e4 plus, moto e4 plus india launch, moto e4 plus launched in india, motorola, moto e4 plus specs, moto e4 plus price in india, moto e4 plus price, moto e4 plus battery, moto e4 vs redmi 4, mobiles, smartphones

Moto has been teasing the India launch of Moto E4 Plus, the budget smartphone with 5000mAh battery, over the past few days.

భారతీయ విఫణిలోకి త్వరలో మోటో ఈ4 ప్లస్‌.. ధరెంతో తలుసా.?

Posted: 07/06/2017 07:36 PM IST
Moto e4 plus india launch date announced

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ.. తాజాగా మొబైల్ రంగంలో అడుగుపెట్టి ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని తమ ఖాతాదారులుగా మార్చుకుంటుంది. ఈ క్రమంలో మోటరోలా కంపెనీని కూడా తనలో మిలితం చేసుకున్న నేపథ్యంలో అటు లెనోవో తో పాటుగా ఇటు మోటోరాలో బ్రాండ్ ను కూడా ప్రమోట్ చేస్తూ బిజీగా వుంది. తాజాగా మరో సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ ను భారతీయ విఫణీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ నూతన ఉత్పత్తి కేవలం ఫ్లిఫ్ కార్టులో మాత్రమే లభించనుంది. ఇందుకు ఈ నెల 12న ముహూర్తంగా నిర్ణయించుకుంది. 12న దేశీయ మార్కెట్ లో ఈ భారీ బ్యాటరీతో కూడిన (5000 ఎంఏహెచ్‌) మోటో ఈ4 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది.

ఈ మేరకు కంపెనీ వర్గాలు అధికారికంగా దృవీకరించాయి. వచ్చే వారంలో జరుగోయే లాంచింగ్‌ ఈవెంట్‌కు కంపెనీ ఆహ్వానాలు కూడా పంపుతోంది. గత నెలలోనే ఈ ఫోన్‌ను భారత్‌లోకి తీసుకొస్తున్నట్టు ధృవీకరిస్తూ ఓ వీడియోను కూడా పోస్టు చేసింది. ఈ మోడల్‌ను గ్లోబల్‌గా జూన్‌లోనే మోటో ఈ4 స్మార్ట్‌ఫోన్‌తో పాటు లాంచ్‌ చేసింది. మోటో ఈ4 ప్లస్‌ మోడల్‌ ప్రత్యేక ఆకర్షణ బిగ్‌ బ్యాటరీ. భారత మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న రెడ్‌మి 4 స్మార్ట్‌ఫోన్‌కు గట్టిపోటీగా ఈ ఫోన్‌ లాంచ్‌ కాబోతుంది.
 
స్పెషిఫికేషన్లు:-

5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
720 x 1280 పిక్సెల్ రెజుల్యూషన్
స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్
2జీబీ ర్యామ్
16జీబీ/32జీబీ స్టోరేజ్
13 ఎంపీ రియర్ కెమెరా
5ఎంపీ ఫ్రంట్ కెమెరా
ఆండ్రాయిడ్ నోగట్ 7.1.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
ఐరన్ గ్రే, ఫైన్ గోల్డ్ వేరియంట్లలో లభ్యం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Moto E4 Plus  launch  Indian market  lenovo  motorola  Flipkart  E-commerce  business  technology  

Other Articles