Moto E4 Plus With 5000mAh Battery Launched in India భారతీయ విఫణిలోకి త్వరలో మోటో ఈ4 ప్లస్‌.. ధరెంతో తలుసా.?

Moto e4 plus with 5000mah battery launched in india

moto e4 plus, moto e4 plus india launch, moto e4 plus launched in india, motorola, moto e4 plus specs, moto e4 plus price in india, moto e4 plus price, moto e4 plus battery, moto e4 vs redmi 4, mobiles, smartphones

Motorola claims that value seekers are looking for more RAM, longer battery life and a good camera. And with the Moto E4 series, the company wishes to deliver on these three fronts.

భారతీయ విఫణిలోకి త్వరలో మోటో ఈ4 ప్లస్‌.. ధరెంతో తలుసా.?

Posted: 07/12/2017 06:04 PM IST
Moto e4 plus with 5000mah battery launched in india

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ.. తాజాగా మొబైల్ రంగంలో అడుగుపెట్టి ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని తమ ఖాతాదారులుగా మార్చుకుంటుంది. ఈ క్రమంలో మోటరోలా కంపెనీని కూడా తనలో మిలితం చేసుకున్న నేపథ్యంలో అటు లెనోవో తో పాటుగా ఇటు మోటోరాలో బ్రాండ్ ను కూడా ప్రమోట్ చేస్తూ బిజీగా వుంది. మోటోరొలా ‘ఈ’ సిరీస్‌లో మరో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. మోటో ఈ4, ఈ4 ప్లస్ పేరిట తీసుకొస్తున్న ఈ ఫోన్లను ఢిల్లీలో ఆవిష్కరించింది.

తొలిసారిగా మోటోరొలా బిగ్‌బ్యాటరీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సరికొత్త 4జీ స్మార్ట్ ఫోన్లలో రెండు మోడళ్లను రెండు రకాలుగా విక్రయాలకు పెట్టింది. వీటిలో ఈ4ను ఆఫ్‌లైన్‌లో విక్రయించనుండగా.. ఈ4ప్లస్‌ను మాత్రం బుధవారం అర్ధరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. దీని ధరను రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది. ఇక ఈ4 మొబైల్‌ ధర రూ.8999గా కంపెనీ పేర్కొంది. కాగా భారత మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న రెడ్‌మి 4 స్మార్ట్‌ఫోన్‌కు గట్టిపోటీగా ఈ ఫోన్‌ లాంచ్‌ కాబోతుంది.
 
స్పెషిఫికేషన్లు:-

5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
720 x 1280 పిక్సెల్ రెజుల్యూషన్
స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్
2జీబీ ర్యామ్
16జీబీ/32జీబీ స్టోరేజ్
13 ఎంపీ రియర్ కెమెరా
5ఎంపీ ఫ్రంట్ కెమెరా
ఆండ్రాయిడ్ నోగట్ 7.1.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌
ఐరన్ గ్రే, ఫైన్ గోల్డ్ వేరియంట్లలో లభ్యం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Moto E4 Plus  launch  Indian market  lenovo  motorola  Flipkart  E-commerce  business  technology  

Other Articles