భారత స్మార్ట్ ఫోన్ ప్రియుల ప్రపంచంలో ఉత్కంఠను రాజేసిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఆపిల్ తాజాగా తన నూతన ఉత్పాదనను భారతీయ విఫణిలోకి ప్రవేశపెట్టింది. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్లోకి ఇవాళ విడుదల చేసింది. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని కొత్త వస్తువులు కొనుగోలు చేసే సంప్రదాయమున్న భారతీయులకు ముంగిట్లోకి వచ్చేసింది. ఐఫోన్ నూతన డివైస్ ల కోసం అసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్ ప్రియులను ఐఫోన్ 8. ఐపోన్ 8 ప్లస్ లు మురిపిస్తాయని సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సందర్భంగా ఐఫోన్ 8. ఐపోన్ 8 ప్లస్ కొనుగోలు చేసిన కస్టమర్లకు ఓ ఆకర్షణీయమైన ఆఫర్ ను రిలయన్స్ జియో అందిస్తోది. సిటీ బ్యాంక్ కార్డ్ ద్వారా బుక్ చేసుకుంటే ఐ ఫోన్ 8 , 8 ప్లస్ పై భారీ క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇవాళ భారత్ లో ప్రవేశపెడతున్న సందర్భంగా ఈ ఒక్క రోజు కొనుగోలు చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ అఫర్ వర్తించనుంది. ఈ సందర్భంగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ కు సంబంధించిన స్పెషల్ ఏవీని ప్రదర్శించారు.
దీంతో పాటు రిలయన్స్ డిజిటల్, జియో.కాం ద్వారా ఐఫోన్ 8, 8 ప్లస్ కొనుగోలు చేసిన వారికి 70శాతం క్యాష్‌బ్యాక్ (బై బ్యాక్) ఆపర్ అందిస్తోంది. ఈ పథకంలో ఐఫోన్ 8, ఐ ఫోన్ 8ప్లస్ కొనుగోలు చేసి, జియో వినియోగదారులకు ఏడాది తరువాత ఆ క్యాష్ బ్యాక్ అందిచనుంది. నెలకు రూ.799 జియో ప్యాక్ వినియోగదారులకు మాత్రమే బై బ్యాక్ గ్యారెంటీ అందుబాటులో ఉంటుంది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ వీటిని లాంచ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more