Maruti Suzuki S-Presso Mini SUV Launch మారుతి నుంచి మిని ఎస్.యూ.వి ‘‘ఎస్ ప్రెస్సో’’

Maruti s new mini suv s presso starts from rs 3 6 lakh

Maruti new mini suv,maruti new car,maruti S-Presso,maruti spresso,S-Presso specifications,S-Presso features,maruti S-Presso specifications, automobile, technology, business

The country's biggest car-maker Maruti Suzuki today launched its new mini-SUV S-Presso. The new Maruti mini-SUV is priced from in the range of range of Rs 3.69 lakh to Rs 4.91 lakh.

దేశీయ విఫణిలోకి మారుతి నుంచి మిని ఎస్.యూ.వి ‘‘ఎస్ ప్రెస్సో’’

Posted: 09/30/2019 07:35 PM IST
Maruti s new mini suv s presso starts from rs 3 6 lakh

చిన్నకారు సెగ్మెంట్లో మరో కారు వచ్చింది. మారుతి సుజుకి సంస్థ తన పోర్ట్ ఫోలియోలో తాజాగా ఎస్ ప్రెస్సో కారును కూడా చేర్చింది. మినీ ఎస్ యూవీగా పిలవదగ్గ ఎస్ ప్రెస్సో కారు ఇవాళ మార్కెట్లో విడుదలైంది. దీని ధర రూ.3.69 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఎస్ యూవీ లుక్ తో ఉన్న ఎస్ ప్రెస్సో గతేడాది ఆటో ఎక్స్ పోలో ప్రదర్శితమైనప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అని మారుతి అభిమానులు ఎదురుచూశారు. దసరా కానుకగా వచ్చిన ఈ కారు బీఎస్6 ప్రమాణాలతో తయారైంది. అంతర్జాతీయ బ్రాండ్ మినీకూపర్ తరహాలో ఎస్ ప్రెస్సో కారును డిజైన్ చేశారు.

సెక్యూరిటీ ఫీచర్ల పరంగా ఇది ఏ పెద్ద కారుకూ తీసిపోదు. డ్యూయల్ ఎయిర్ బాగ్, పార్కింగ్ సెన్సర్ (రియర్ వ్యూ)తో పాటు స్పీడ్ సెన్సర్ డోర్ లాకింగ్ సదుపాయాలు ఉన్నాయి. బాడీ డిజైన్ చూస్తుంటే అంతర్జాతీయ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని తయారుచేసినట్టు కనిపిస్తున్నా, చిన్నపట్టణాల వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా ధరలు నిర్ణయించారు. ఎస్ ప్రెస్సో రాకతో చిన్న కార్ల విభాగంలో రేనాల్ట్ క్విడ్ కు గట్టిపోటీ తప్పదని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maruti  new mini suv  maruti S-Presso  specifications  features  automobile  technology  business  

Other Articles