జియోమీ.. తాజాగా రెడ్మీ సిరీస్‌లో 10 మోడల్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. భారత మార్కెట్లో రిలీజ్ అయిన రెడ్మీ 10 మోడల్ ఫోన్ ఫీచర్లు మాత్రం సూపర్బ్‌గా, టెంప్టింగ్గా ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ క్వాడ్ రేర్ కెమెరాతో ఈ ఫోన్ విడుదలైంది. సాధారణంగా.. బడ్జెట్ ఫోన్లలో 32 మెగాపిక్సెల్ రేర్ కెమెరానే అందిస్తారు. కానీ.. రెడ్మీ 10 ఫోన్లో మాత్రం 50 మెగాపిక్సెల్ కెమెరాను అందిస్తున్నారు. దానితో పాటు మీడియాటెక్ ప్రాసెసర్‌ను అందిస్తున్నారు.
మూడు వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది. బేస్ మోడల్ 4జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ఫోన్ ధర సుమారుగా 13,300 రూపాయలు ఉండనుంది. అలాగే.. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న మోడల్ ఫోన్ ధర సుమారుగా రూ.14,800 ఉండనుంది. 6జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ ధర సుమారు రూ.16,283 గా ఉండనుంది. అలాగే.. వైట్, కార్బన్ గ్రే, సీ బ్లూ కలర్లలో ఈ ఫోన్ లభించనుంది.
బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లతో ఫోన్ కావాలనుకుంటే.. ఈ ఫోన్ సూపర్బ్ చాయిస్‌గా చెప్పుకోవచ్చు. అయితే.. ఈ ఫోన్ ను మార్కెట్లో విడుదల చేసినప్పటికీ.. ఇంకా అన్ లైన్, ఆఫ్ లైన్ (రీటైల్ దుకాణాలలో) ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ కు డిమాండ్ అధికంగా ఉండటంతో.. లాంచింగ్ తోనే రికార్డు సృష్టించాలని కూడా సంస్థవర్గాలు ప్రయత్నాల్లో వున్నాయని ట్రేడ్ అనలిస్టుల భావిస్తున్నారు. త్వరలోనే ఈ ఫోన్లు మార్కెట్లో అందుబాటులోకి రానుంది.
ఫోన్ స్పెసిఫికేషన్లు ఇలా:
6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అడాప్టివ్ సింక్ డిస్ప్లే
90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్,
మీడియాటెక్ హెలియో జీ88 ఎస్వోసీ ఫ్రోసెసర్
కెమెరా: 50 మెగాఫిక్సల్ తో పాటు 8 + 2 మెగాపిక్సల్ లతో కలపి మొత్తంగా మూడు
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్
64, 128 జీబి స్టోరేజ్
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
1080*2400 పిక్సల్ రిసోల్యూషన్
3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ సహా రెండు స్పీకర్లు
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more