Ramcharan zanjeer movie rights dispute

ramcharan zanjeer, ramcharan zanjeer movie , ramcharan zanjeerrights dispute, ramcharan zanjeer teaser, ramcharan zanjeer working stills, film news, movie news, ramcharan,

ramcharan zanjeer movie rights dispute

19.gif

Posted: 01/26/2013 04:35 PM IST
Ramcharan zanjeer movie rights dispute

aaa

       ‘నాయక్’ సక్సెస్ తో దూకుడు మీదున్న రామ్ చరణ్ నటిస్తున్న తొలి హిందీ చిత్రం 'జంజీర్'ని వివాదం వెంటాడుతూనే వుంది. ఈ చిత్రం రీమేక్ విషయంలో తమను సంప్రదించలేదని, తమకు ఎంతోకొంత ముట్టచెప్పాలని 'జంజీర్' ఒరిజినల్ సినిమా కథా రచయితలు సలీంఖాన్, జావేద్ అక్తర్ మొదటి నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం మనకు తెలుసు. రీమేక్ హక్కుల ఫీజును తమకు చెల్లించాలంటూ వారు నిర్మాతకు లీగల్ నోటీసులు కూడా జారీచేశారు. అయితే, నిర్మాత ఎంతకూ దిగి రాకపోవడంతో ఇప్పుడు ఈ విషయం సీరియస్ అయింది. సినిమాను విడుదల కానివ్వమంటూ రచయితలు హెచ్చరిస్తున్నారు. రీమేక్ హక్కులకు గాను తమకు 6 కోట్లు చెల్లించాలంటూ వారు డిమాండు చేస్తున్నారు. హిందీ వెర్షన్ కు 3 కోట్లు, తెలుగు వెర్షన్ కు 3 కోట్లు ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నారు. అయితే ఈ అంశాన్ని జంజీర్ నిర్మాత తేలిగ్గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈజీగా ఈ సమస్య సమసిపోతుందని ఆయన ధీమాగా ఉన్నట్టు సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Padma awards for ramanaidu sridevi and bapu
Tarakaratna vijetha movie audio responce  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles