Telugu actress reshma rathore getting movie offers in hindu and kollywood

reshma rathore, reshma hot photo shoot, reshma latest news, reshma hot photos, reshma latest news, reshma movies, reshma kollywood movies, reshma rathore bollywood movies, telugu actresses, tollywood actress

telugu actress reshma rathore getting movie offers in hindu and kollywood

తమిళ తంబీలను ఊరిస్తున్న జూ.త్రిష!

Posted: 09/29/2014 03:14 PM IST
Telugu actress reshma rathore getting movie offers in hindu and kollywood

‘‘ఈ రోజుల్లో’’ సినిమా ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చుకున్న తెలుగమ్మాయి రేష్మ రాథోర్... తొలిసినిమాతోనే సక్సెస్ అందుకుని జూనియర్ త్రిషగా పేరు సంపాదించుకుంది. దాంతో ఈ అమ్మడికి తెలుగులో ఒకదాని తర్వాత మరొకటి ఆఫర్లు వచ్చాయి. ఆమధ్య ఒక సినిమాలో ఐటెం సాంగ్ లో నృత్యించి, అందాలను ఆరబోసిన ఈ అమ్మడిని చూసి దర్శకనిర్మాతలు ఫిదా అయిపోయారు. అంతే! అక్కడి నుంచి ఈమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తూనే వున్నాయి. ఇప్పటికే తెలుగులో మూడు సినిమాలు సెట్స్ పై వుంటే.. మరో హిందీ, తమిళంలో రెండేసి సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం!

నిజానికి చెప్పుకోవాలంటే.. మన టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఇతర రాష్ట్రాలనుంచి హీరోయిన్లను ఇంపోర్ట్ చేసుకుంటారే తప్ప... తెలుగమ్మాయిలకు మాత్రం అవకాశాలు ఇవ్వరు. తెలుగమ్మాయిల్లో టాలెండ్ వుండదనో లేక మరే కారణాలతో వారిని తీసుకోరో స్పష్టంగా చెప్పలేము కానీ తెలుగమ్మాయిలు కూడా సత్తా చాటుతారని చెబుతూనే.. చేతల్లో చేసి నిరూపిస్తోంది త్రిష! తాజా అందుతున్న సమాచారం ప్రకారం.. రేష్మ రాథోర్ రెండు సినిమాలకు సైన్ చేసింది. అందులో మొదటి సినిమా టైటిల్ ‘‘అదకపట్ట తోమగాజనాన్గలే’’... రెండోది ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో వుంది. ఇందులో మొదటి సినిమా అక్టోబర్ 4 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తమిళ వర్గాలు తెలుపుతున్నాయి.

జూనియర్ త్రిషలా పోలికలు వుండటంతోపాటు సెక్సీ అందాలను కలిగివున్న నేపథ్యంలో ఈ అమ్మడికి బాగానే అవకాశాలు వరిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ అమ్మడికి ఇలాగే అవకాశాలు వస్తే.. త్వరలోనే స్టార్ డమ్ కూడా సంపాదిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా.. తెలుగులో తన టాలెంట్ నిరూపించుకున్న రేష్మ.. తమిళంతోపాటు ఇతర చిత్రపరిశ్రమలో కూడా వరుసగా ఆఫర్లు సంపాదించుకోవడం తెలుగు ఇండస్ట్రీకి గర్వించదగిన విషయమేని అందరూ పేర్కొంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : reshma rathore  telugu actress  tollywood news  kollywood news  telugu news  

Other Articles