Allari naresh praises actress karthika nair role in brother of bommali movie

karthika nair, allari naresh, brother of bommali movie, karthika nair latest news, karthika nair hot photo shoot, karthika nair hot photos, karthika nair movies, karthika nair brother of bommali movie, tollywood news, telugu news

allari naresh praises actress karthika nair role in brother of bommali movie

ఆ సన్నివేశాల్లో కార్తీక ఇరగదీసేసిందట!

Posted: 09/29/2014 03:39 PM IST
Allari naresh praises actress karthika nair role in brother of bommali movie

‘‘జోష్’’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన కార్తీక.. ఆ సినిమాతో టాలీవుడ్ లో తన సత్తా చాటుకుంటుందామని అనుకుంది. కానీ.. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడిపోవడంతో ఎవ్వరూ ఈమెకు ఆఫర్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. అటు తమిళంలో కూడా ఒక్క ‘‘రంగం’’ సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో అక్కడ కూడా నిరాశే మిగిలింది. దీంతో ఈ అమ్మడికి ఎక్కడ అవకాశాలు రావోనన్న భయంతో.. తాను స్టార్ డమ్ కోసం ఏ సినిమాల్లోనైనా నటించడానికి సిద్ధమేనని అప్పట్లో ప్రకటించేసింది. (అంటే అందాల ఆరబోతకు తాను సిద్ధమేనని పరోక్షంగా చెప్పేసిందన్నమాట!). అయినా కూడా ఈమెకు అరకొర అవకాశాలు మాత్రమే వచ్చాయి. అయితే ఇంతలోనే ఈ అమ్మడికి టాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ కాకపోయినా.. అల్లరి నరేష్ సరసన ‘‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ’’ చిత్రంలో సిస్టర్ పాత్రలో నటించే అవకాశం లభించింది. వచ్చిన ఆఫర్ ను వద్దనుకోలేక అందుకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రస్తుతం ఆ సినిమా చివరి దశకు చేరుకుంది.

ఈ నేపథ్యంలో అల్లరి నరేష్ తన మూవీ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ముఖ్యంగా కార్తీక గురించి చెబుతూ ఆమెను ప్రశంసలతో ఆకాశానికెత్తేశారు. కార్తీక ఈ చిత్రంలో రౌడీ పాత్రలో బాగానే ఇరగదీసిందని నరేష్ పేర్కొన్నాడు. ముఖ్యంగా ఫైట్ సీన్స్ చేయడం తొలిసారి అయినా కూడా సునాయాసంగానే చేసింది ఆమెను మెచ్చుకున్నాడు. తమిళంలో బిజీగా వున్నప్పటికీ.. తనకు ఈ సినిమాలో పాత్ర నచ్చడంతో డేట్లు ఎడ్జెస్ట్ చేసుకుని మరీ నటించిందని తెలిపాడు. ఈ సినిమాలో కార్తీక పాత్ర స్పెషల్ అట్రాక్షన్ గా వుంటుందని, ప్రేక్షకులకు నిజంగానే ఆమె చేసిన ఫైటన్ సీన్స్ బాగానే ఆకట్టుకుంటాయని పేర్కొన్నాడు.

అల్లరి నరేష్, మోనాల్ గుజ్జర్ జంటగా నటించిన ఈ చిత్రానికి చిన్నికృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నరేష్ కు ట్విన్ సిస్టర్ గా కార్తీక నటించింది. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని, అక్టోబర్ 4వ తేదీన ఆడియో రిలీజ్ కానుందని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అటు కార్తీక.. ఈ సినిమాతోనైనా సత్తా చాటుకుని టాలీవుడ్ లో తన స్థానం పదిలం చేసుకోవాలని భావిస్తోందట! ఆ నేపథ్యంలోనే అమ్మడు ఈ సినిమాలో చాలా కష్టపడిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మరి ఈ మూవీతోనైనా కార్తీక టాలీవుడ్ లో సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karthika nair  allari naresh  brother of bommali movie  tollywood news  telugu news  

Other Articles