Ar rehman son ameen to sing song in maniratnam latest movie

ar rehman, ar rehman son ameen, ar rehman latest news, ar rehman son news, ameen with ar rehman, director mani ratnam, mani ratnam latest news, mani ratnam movies

ar rehman son ameen to sing song in maniratnam latest movie

‘‘మణి’’ కోరికను రెహమాన్ తనయుడు తీరుస్తాడా?

Posted: 09/29/2014 04:29 PM IST
Ar rehman son ameen to sing song in maniratnam latest movie

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన ఇండియన్ చిత్రపరిశ్రమలో వారసత్వ పరంపర కొనసాగుతున్న విషయం తెలిసిందే! చిత్రపరిశ్రమలో స్టార్ డమ్ సంపాదించుకున్న వారి తనయులు సునాయాసంగా ఆఫర్లు పొందడమే కాకుండా వాళ్లు కూడా స్టార్ డమ్ ను సంపాదించుకుంటారు. ఈరోజుల్లో అయితే ఇది మరీ విపరీతంగా వుంది. ప్రస్తుతం చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న యువహీరోలందరూ దాదాపు ఇలా వారసత్వం నుంచి వచ్చినవారే! ఇప్పుడు తాజాగా వీరి జాబితాలోకి ఏ.ఆర్.రెహమాన్ తనయుడు 12 సంవత్సరాల అమీన్ కూడా చేరిపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఒక హిందీ చిత్రంలో పాట పాడిన అమీన్.. తమిళంలో కూడా తన స్వరాన్ని వినిపించబోతున్నాడని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అది కూడా మణిరత్నం తెరకెక్కించబోతున్న తాజా చిత్రంలో అమీన్ పాట పాడబోతున్నాడని సమాచారం!

ఇటీవలే మణిరత్నం తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర భారీగా బోల్తాపడిపోవడంతో సీనియర్ హీరోలతోపాటు జూనియర్ తారలందరూ మణిరత్నం సినిమాల్లో నటించడానికి తిరస్కరిస్తుంటే.. ఏఆర్ రెహమాన్ కుమారుడు మాత్రం ఆయన చిత్రంలో పాట పాడబోతున్నాడనే విషయం చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే.. తమిళంలో కొందరు దర్శకనిర్మాతలు తమ సినిమాలో అమీన్ చేత పాటలు పాడిద్దామని ఎంతోమంది రిక్వెస్ట్ చేస్తే... తండ్రి రెహమాన్ మాత్రం వారి కోరికలను చాలా సున్నితంగా తిరస్కరించాడు. కానీ.. మణిరత్నం అడిగిన వెంటనే ఆయన కోరికను కాదనలేక ఆయన సినిమాలో తన కొడుకుతో పాట పాడిస్తానని ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఫ్లాప్ డైరెక్టర్ గా ముద్ర వేయించుకున్న మణిరత్నం సినిమాలో రెహమాన్ తన తనయుడితో ఎందుకు పాడిస్తున్నాడోనని అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇందుకు ముఖ్యకారణం ఏమిటంటే.. ఏఆర్ రెహమాన్ నేడు ఈ స్థాయికి చేరుకోవడానికి మణిరత్నం కావడమే! 1992లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘‘రోజా’’ సినిమా ద్వారానే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఆ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ కావడంతో టాప్ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకోవడంతోపాటు.. నేడు ఆస్కార్ అవార్డు అందుకున్న స్థాయికి ఎదిగిపోయాడు. ఈ సెంటిమెంట్ తోనే రెహమాన్ మణిరత్నం తెరకెక్కించబోయే తాజా సినిమాలో తన కుమారుడు అమీన్ తో పాడించడానికి ఒప్పుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఫ్లాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మణిరత్నం కూడా ఈసారి ఎలాగైనా తిరిగి తన స్టార్ డమ్ ను తిరిగి పొందాలనే కసితో వున్నాడని.. ఆ నేపథ్యంలో ఒక ఫ్రెష్ లవ్ స్టోరీని తయారు చేస్తున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ar rehman  ar rehman son ameen  director mani ratnam  kollywood news  telugu news  

Other Articles