Hollywood reality super model kim kardashian attacked by ukranian crazy fan in paris

kim kardashian latest news, kim kardashian paris fashion week, kim kardashian nude photo shoot, kim kardashian hot photos, kim kardashian bikini photos, kim kardashian kanye weste, kim kardashian fan attacked, kim kardashian child

hollywood reality super model kim kardashian attacked by ukranian crazy fan in paris

చూపిస్తోంది కదా అని.. పబ్లిక్ లోనే దోచేశాడు!

Posted: 09/29/2014 05:38 PM IST
Hollywood reality super model kim kardashian attacked by ukranian crazy fan in paris

అమెరికన్ టీవీ రియాలిటీ స్టార్ కిమ్ కర్దాషియన్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ వుందో అందరికీ తెలిసిందే! మూడుపదుల వయస్సు దాటి, ఒక పాపకు తల్లైన కిమ్ కర్దాషియన్.. ఇప్పటికీ తన భారీ అందాలను ఆరబోస్తూ జనాలను పిచ్చెక్కిస్తూనే వుంది. అంతెందుకు.. బయటికి విహరించడానికి వచ్చినప్పుడు కూడా తన ‘‘లో-అందాలు’’ కనిపించేవిధంగా ట్రాన్స్ పరెంట్ డ్రెస్సులు వేసుకుని మరీ విహరిస్తుంటుంది. సాధారణంగా ఒక మోడల్ గా జీవితాన్ని కొనసాగిస్తున్న ఈ అమ్మడు.. తన సెక్స్ టేప్ విడుదల చేసి పాపులర్ అవ్వడంతో.. అప్పటి నుంచి అటువంటి సెక్సీ చేష్టలే చేసుకుంటూ వస్తోంది. ఇటీవలే తన భర్తతో కలిసున్న బెడ్ రూమ్ ఫోటోలను కూడా రిలీజ్ చేసి, త్వరలోనే తమ సెక్స్ టేప్ ను రిలీజ్ చేస్తానని బహిరంగంగా ప్రకటన ఇచ్చేసుకుంది. అంటే.. ఏదో ఒక విధంగా సెక్సీ చేష్టలు చేస్తూ ఈ అమ్మడు వార్తల్లోకెక్కుతూ వుంటుంది. దీంతో ఈమె ఈమెకు ఎంతోమంది ఫ్లాట్ అయిపోయారు. ఈమె ఎక్కడైనా కనిపిస్తే చాలు.. ఆటోగ్రాఫ్ లు, ఫోటోగ్రాఫ్ లు అంటూ వెనుకపడిపోతుంటారు. ఈ తరహాలోనే ఓ అభిమాని కూడా పబ్లిక్ లోనే ఆమె మీద దాడి చేశాడు.

ప్యారిస్ ఫ్యాషన్ వీక్ ఈవెంట్ కి హాజరయ్యేందుకు ఈనెల 27వ తేదీని ప్యారిస్ చేరుకున్న ఈ అమ్మడిని చూసి... అక్కడున్న ఈమె అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టేశారు. సెక్యూరిటీ కూడా వాళ్లను అదుపు చేయలేకపోయారు. ఈ సందర్భంలోనే ఉక్రేనియాకు చెందిన విటాలీ అనే ఒక వీరాభిమాని ఆమెను కలుసుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆ జనాల్లో దూసుకుపోయాడు. దీంతో ఆమె పడిపోయినంత పనైంది. అతని హడావుడితో బెంబేలెత్తిపోయిన కిమ్.. ఒక్కసారిగా కేకలు పెట్టేసింది. ఆ సమయంలో ఆమె వెంట ఆమె భర్తతోపాటు సెక్యూరిటీ సిబ్బంది వున్నప్పటికీ విటాలీని అదుపు చేయలేకపోయారు. దీంతో ఆ హడావుడిలో ఏ జరిగిందో ఎవ్వరూ గ్రహించలేకపోయారు.

అయితే ఈ ఘటన జరిగిన అనంతరం ఆ ప్రేమ పిచ్చోడు మాట్లాడుతూ.. తానేమీ కిమ్ ని హాని చేయదలుచుకోలేదని, ఆమె ఒక దేవత అంటూ అభివర్ణించాడు. అలాగే ఆమెను పెళ్లి చేసుకున్న క్యానేని లక్కీ మ్యాన్ అంటూ తెలిపాడు. అటు కిమ్ కర్దాషియన్ కు కూడా అంతగా హాని ఏమి జరగలేదని సిబ్బంది పేర్కొంది. అయినా.. సాధారణంగానే తెరపై తమ అభిమాన తారలను చూసి ఉర్రూతలూగే ఫ్యాన్స్.. పబ్లిక్ లో కనిపిస్తే ఇంకేమైనా వుంటుందా..? అది కూడా ఆమె శృంగారతార! ఇంకొక విషయం ఏమిటంటే.. ఆ ఉక్రేనియా అభిమాని విటాలీ.. బ్రాడ్ పిట్, లియోనార్డో డీ కేప్రియో, విల్ స్మిత్ లాంటి సెలబ్రిటీల మీద కూడా పడినంతపని చేసిన సందర్భాలు కూడా వున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kim kardashian  kanye weste  ukranian fan vitali  paris fashion week  telugu news  

Other Articles