Main hoon rajnikanth movie director fazil controversial statements on super star rajnikanth

main hoon rajnikanth movie, superstar rajnikanth, rajnikanth latest news, rajnikanth movies, rajnikanth controversy, main hoon rajnikanth movie director, bollywood news, kollywood news, telugu news

main hoon rajnikanth movie director fazil controversial statements on super star rajnikanth

రజనీకే సవాల్ విసిరిన చిన్నసినిమాల డైరెక్టర్!

Posted: 09/29/2014 05:57 PM IST
Main hoon rajnikanth movie director fazil controversial statements on super star rajnikanth

బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న ‘‘మై హూ రజనీకాంత్’’ మూవీకి, తమిళ సూపర్ స్టార్ మూవీకి మధ్య వివాదాలు తెరలేపిన విషయం తెలిసిందే! తన పర్మిషన్ తీసుకోకుండా తన పేరును వాడుకున్నారని రజనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఆ మూవీ డైరెక్టర్ ఫాజిల్ సమాధానమిస్తూ... తన మూవీలో ఎటువంటి వివాదాస్పద అంశాలు లేవని.. రజనీని కించపరిచే సన్నివేశాలు లేవని... కావాలంటే విడుదలకు ముందే రజనీకి, ఆయన కుటుంబసభ్యులకు తన సినిమాను చూపిస్తానని పేర్కొన్నాడు. అయితే ఈ విషయం మీద ఎవరూ పట్టించుకోవడం కాదు కదా... రజనీ కూడా ఆ మూవీ ప్రివ్యూకి వెళ్లలేదని సమాచారం! దీంతో ఈ విషయం మరింత రచ్చరచ్చగా మారిపోయింది.

‘‘ఫాజిల్ (డైరెక్టర్) రజనీని కించపరిచేలా మాట్లాడాడు.. అందుకే ఆ సినిమా ప్రివ్యూ చూడటానికి వెళ్లలేదు’’ అని రజనీ తరఫు లాయర్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో రెచ్చిపోయిన ఆ డైరెక్టర్.. తలబిరుసుగానే సమాధానమిచ్చాడట! ‘‘సినిమా చూడకుండానే పరువునష్టం అంటూ ఆలస్యం చేస్తున్నారేంటి..? ఇప్పుడు మీరు చేస్తున్నది పరువునష్టం కాదా..?’’ అంటూ తన లాయర్ చేత రజనీకే ఎదురు ప్రశ్న వేయించినట్లు సమాచారం! అతను సంధించిన ప్రశ్న మీద రజనీ ఇంతవరకు స్పందించలేదు కానీ.. ఆయన అభిమానులు మాత్రం ఆ డైరెక్టర్ మీద చాలా ఆగ్రహంతో వున్నారని కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ‘‘చంద్రముఖి’’ సినిమాలో ఆ పాత్రవేషధారణలో వున్న జ్యోతిక, రజనీ చెంపఛెళ్లమనిపించే సన్నివేశం వున్నందుకే రచ్చరచ్చ చేసిన అభిమానులు.. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేలా లేరని.. అతని మీద నిప్పులు చెరుగుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలావుండగా.. ఆ డైరెక్టర్ కావాలనే తన సినిమాను పబ్లిసిటీ చేసుకోవడం కోసం వివాదాన్ని చాలా పెద్దిగా చేస్తున్నాడని.. అనవసరంగా రజనీలాంటి సూపర్ స్టార్ తో గొడవలు పెట్టుకుంటున్నాడని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాను సంధించిన ప్రశ్న మీద వెంటనే క్షమాపణలు చెబితేగానీ ఈ వ్యవహారం ఆగేలా లేదని... లేకపోతే అతనిని చిత్రపరిశ్రమనుంచే బహిష్కరించే అవకాశాలు చాలా వున్నాయని పేర్కొంటున్నారు. మరి దీనిమీద ఆ డైరెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో..? రజనీ ఎలా వ్యవహరిస్తారో..? ఆయన అభిమానులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles