Balakrishna ntr to attend kalyan ram pataas movie audio release

balakrishna and ntr issues, balakrishna junior ntr war, balakrishna jr ntr issues, balakrishna in memu saitham, balakirshna in pataas audio release function, ntr in pataas audio release function, pataas movie release date, pataas movie trailer latest photos, kalyan ram next movie updates, tollywood latest news updates,

balakrishna ntr to attend kalyan ram pataas movie audio release : tollywood buzz that junior ntr and balakrishna may present for nandamuri kalyan ram latest movie pataas audio release function on 07th december

నందమూరి వారి దాగుడుమూతలాట

Posted: 12/03/2014 03:17 PM IST
Balakrishna ntr to attend kalyan ram pataas movie audio release

నందమూరి అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కోరిక త్వరలోనే తీరనుంది. నందమూరి నట సింహాలు బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ కలిసి మెరవనున్నారు. మొన్నటి ‘మేము సైతం’ కార్యక్రమంలో తళుక్కున బాబాయ్ బాగానే ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందారు. అబ్బాయ్ కూడా పర్మార్మెన్స్ చూపించేందుకు ఉత్సాహం చూపినా., జ్వరం రావటంతో నేను సైతం అనే ఛాన్స్ లేకపోయింది. కాని.., త్వరలో జరిగే నందమూరి వారి వేడుకలో వీరిద్దరూ కలుస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘పటాస్’ సినిమా ఆడియో విడుదల ఈ నెల 7న జరగునంది. హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియో లాంచ్ కు ముఖ్య అతిధులుగా బాలకృష్ణ, ఎన్టీఆర్ ను ఆహ్వానించారట. ఫ్యామిలి ప్రోగ్రాం కావటంతో వీరిద్దరూ తప్పక హాజరవుతారని అంతా భావిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ప్రకటనలు చాలానే వచ్చాయి. ఇద్దరూ కలిసి కన్పిస్తారని..., ఫర్ఫార్మెన్స్ ఇస్తారని అనుకున్నారు. అయితే అవన్నీ గాలి మాటలే అని తర్వాత తేలిపోయింది. ఇప్పుడొస్తున్న ఊహాగానాలు కూడా తేలిపోతాయా లేక.., వాస్తవంగా నిలబడతాయా అనేది 7న తేలనుంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై వస్తున్న ‘పటాస్’ మూవీలో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా కన్పించనున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ చివర్లో సినిమా విడుదల కానుంది. అటు రవితేజ హీరోగా రూపొందుతున్న ‘కిక్ 2’ సినిమాను కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pataas  kalyan ram  balakrishna  ntr  tollywood  

Other Articles