Tollywood cheated shweta basu prasad

shweta basu prasad on tollywood, shweta basu prasad working in phantom productions, phantom productions, shweta basu prasad tollywood persons relations, santosham awards function sweta basu prasad, phantom productions movies, latest news updates, tollywood latest news updates

tollywood cheated shweta basu prasad : sweta basu prasad fires on some famous persons of tollywood industry says that they cheated her and caused to face prostitution allegations

టాలీవుడ్ అంటే ఛీ కొడుతొంది... మోసగాళ్లపై మండిపడ్డ శ్వేత బసు

Posted: 12/03/2014 05:16 PM IST
Tollywood cheated shweta basu prasad

‘ఎకాడా’... అంటూ తెలుగు ప్రేక్షకుల ‘కొత్త బంగారు లోకం’లోకి అడుగుపెట్టిన శ్వేతబసు ఈ లోకంలో కొద్దికాలం పాటు వెలిగింది. ఆ తర్వాత చీకటి కోణాలు నెరిపినట్లు ఆరోపణలు ఎదుర్కుంది. ప్రస్తుతం వీటన్నిటికి దూరంగా తన పని తాను చేసుకుంటున్న ఈ అమ్మాయిని కదిలిస్తే టాలీవుడ్ పై కస్సుమంటోంది. ఇండస్ర్టీ ఇంతలా మోసం చేస్తుందనుకోలేదు. ఓ అమ్మాయి జీవితంతో ఆడుకుంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తానెప్పటికీ టాలీవుడ్ ను మర్చిపోలేనని కోపంతో మండిపోతుంది. అరెస్టయిన సమయంలో టాలీవుడ్ ప్రముఖులంతా ఈమెకు సంఘీభావం ప్రకటించటంతో పాటు.., తప్పుచేయలేదని, సినిమా చాన్సులు ఇస్తామని ప్రకటించారు. ఇంతలా మద్దతు ఇస్తే., ఇండస్ర్టీ మోసం చేసింది అనటం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

దీని గురించి తెలుసుకోవాలంటే శ్వేత గతంలో చెప్పిన కొన్ని విషయాలు గుర్తుచేసుకోవాలి. ఓ సినిమా కార్యక్రమంకు హాజరయ్యేందుకు హైదరాబాద్ రాగా.., ఓ హోటల్ లో తనకు నిర్వాహకులు గదిని బుక్ చేశారని.., వారు కేటాయించిన గదిలో ఉన్నపుడే పోలిసులు వచ్చి వ్యభిచారం చేస్తున్నట్లు ఆరోపించి అరెస్టు చేశారని తెలిపింది. ఇక్కడ హోటల్ లో ఏం జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా..., నిర్వాహకులు ఇచ్చిన రూంలో ఉండగా అరెస్టయిన విషయం వాస్తవం. ఇదే విషయం పదేపదే చెప్తోంది. కావాలనే కొందరు తనను కేసులో ఇరికించారని ఇప్పటికీ ఆరోపిస్తోంది. శ్వేత వ్యభిచారం చేసింది నిజమైతే.. ఆమెతో దొరికిన వ్యక్తి వివరాలు పోలిసులు బయటకు వెల్లడించాలి కాని అలా జరగలేదు కాబట్టి., దీంట్లో కుట్రకోణం ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి.

అలా తనను కొందరు మోసం చేసి.., అన్యాయంగా కేసులో ఇరికించారని శ్వేత ఆరోపిస్తోంది. త్వరలోనే వీరి పేర్లు బయటకు వెల్లడిస్తానని మరోసారి చెప్పింది. సినిమా ఛాన్సులు వస్తున్నా వాటిని కొన్నాళ్ళు పక్కనబెడుతానని స్పష్టం చేసింది. ఈ మద్యే శ్వేతకు హన్సల్ మెహతా డాక్యుమెంటరీలో అవకాశం ఇచ్చినా.., అందులో పాత్ర పెద్దగా లేకపోవటంతో ఆఫర్ తీసుకోలేదు. త్వరలోనే మరో ఆఫర్ ఇస్తానని మాట ఇచ్చాడు. ప్రస్తుతం ఫాంటమ్ ప్రొడక్షన్స్ లో స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా శ్వేత పనిచేస్తోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shweta basu prasad  tollywood  phantom productions  latest news  

Other Articles