టాలీవుడ్ అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ‘గోపాల గోపాల’ తర్వాత మరో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే ఇటీవలే ప్రముఖ దర్శకుడు మారుతితో ఓ సినిమా చేయడానికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ప్రోడక్షన్ నెం-2 గా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 16న పూజాకార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించనున్నారు.
‘రన్ రాజా రన్’, ‘జిల్’, ‘ఉత్తమవిలన్’ వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో వెంకీ కనిపించనున్నాడని, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూనే నవ్వించనున్నాడని తెలిసింది. ఆయన పాత్ర చాలా కొత్తగా, వినోదభరితంగా వుండనుందని సమాచారం. కమర్షియల్ యూత్, మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో వెంకీ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పటికే వీరిద్దరూ కలిసి నటించిన ‘లక్ష్మీ’, ‘తులసి’ చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరి ఈ సినిమా వీరిద్దరికి హ్యట్రిక్ విజయాన్ని అందించనుంది. అయితే ఈ చిత్రానికి మొన్నటివరకు ‘రాధాకృష్ణ’ అనే టైటిల్ అనుకున్నారు. కానీ తాజాగా మరో నాలుగు టైటిల్స్ పేర్లు పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది.
ఆ నాలుగు టైటిల్స్... ‘డిమాండ్ రాజ’, ‘రాజా రత్నం’, ‘24 క్యారెట్ బంగారం’, ‘బాబు బంగారం’. ఈ నాలుగు టైటిల్స్ లో వెంకటేష్ ఏదో ఒక టైటిల్ ను సెలెక్ట్ చేస్తారో, లేక వేరే టైటిల్ ను నిర్ణయిస్తారో చూడాలి. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more