గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రజలకు సుపరిచితమైన సునీత ఉపద్రష్ట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సింగర్ సునీతగా పాపులర్ అయిన ఆమె కొన్నేళ్ల క్రితమే తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ.. పైకి మాత్రం ఆమె చిరునవ్వుతోనే కనిపించేవారు. సునీతకి 19 ఏళ్ల వయసులోనే పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయిన ఆమె చాలా ఏళ్లుగా అతడికి దూరంగా ఉంటున్నారు.
మరో పెళ్లి చేసుకుంటారా.. అనే ప్రశ్న సునీతకు చాలా ఏళ్లుగా ఎదురవుతోంది. దీనికి ఆమె ఎప్పుడూ లేదనే సమాధానం ఇచ్చేవారు. కానీ గత కొన్నాళ్లుగా ఆమె పెళ్లి విషయం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెకు కాబోయే భర్త ఐటీ కంపెనీ యజమాని అని, ఆయన కూడా ఇదివరకే విడాకులు తీసుకున్నారని సమాచారం. ఇప్పటి వరకూ పెళ్లి విషయాన్ని సునీత అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. గత నెలలోనే సునీత నానమ్మ చనిపోయారు. సునీత ఇన్నాళ్లూ పిల్లలే ప్రాణంగా బతికారు.
అయితే ఇప్పుడు అమె పిల్లలు కూడా పెద్దవాళ్లవడం.. తల్లిని అర్థం చేసుకోవడంతో సునీత మరో పెళ్లి చేసుకోవాలనుకోవడం సరైన నిర్ణయమేనని ఆమె గురించి తెలిసినవారు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు రేణుదేశాయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్‌తో విడిపోయాక ఏళ్లపాటు ఒంటరిగా గడిపిన ఆమె.. ఇటీవలే మరో వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. త్వరలోనే ఆమె పెళ్లిపీటలు ఎక్కనుంది. సునీత పెళ్లి వార్తలు నిజమైనా అన్న వార్తలపై ఇంకా సునిత నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more