సీన్ ఓపెన్ చేస్తే.. లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయి పేరు బాబు. తన ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందనే బాధతో దేవదాసులా మారిపోతాడు. పిచ్చోడిలా ఫేస్ బుక్, వాట్సాప్ లలో స్టేటస్ అప్ డేట్ చేస్తూ.. వాటిని లైక్ చేయాల్సిందిగా ఫ్రెండ్స్ ను విసిగిస్తుంటాడు. ఆ బాధను భరించలేక ఒకరోజు ఫ్రెండ్స్ బాబు ఇంటికి చేరుకుంటాడు. వాళ్లు అతని సమస్య తెలుసుకుని తనను ఒప్పించే దిశగా ఒక ఫ్రెండ్ తన లవ్ స్టోరీని వివరిస్తాడు. కట్ చేస్తే.. ఫ్లాష్ బ్యాక్. ఒక పల్లెటూరి అబ్బాయి. నగరంలో జాయిన్ అయిన కాలేజీలో మొదటిరోజు. ఎంతో సీదాసాదాగా వుంటాడు.
అయితే అంతలోనే అందమైన అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆమెకోసం తనను తాను పూర్తిగా మార్చుకొని, ట్రెండ్ కు తగ్గట్టు ఫ్యాషన్ బాయ్ లా తయారవుతాడు. ఆమెకోసం అతను గిఫ్ట్ లుగా ఎన్నో విలువైన సామాగ్రిని ఇచ్చేస్తాడు. అయితే ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమిస్తోందని అతడికి తెలిసిపోతుంది. దీంతో అతను మోసపోయానని ఫీలయి తన లవ్ ఫెయిల్యూరేనంటూ భావిస్తాడు. ఇది ఫ్లాష్ బ్యాక్. కట్ చేస్తే.. తిరిగి మళ్లీ సీన్ మొదటికి వస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీని విన్న బాబు.. తన ఫెయిల్యూర్ లవ్ ని మరిచిపోతాడు.
ఈమధ్య అమ్మాయిలు, అబ్బాయిలకు లవర్స్ వుండటం సహజం. అందులో కొంతమంది లవ్ సక్సెస్ అయితే మరికొంతమందివి ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అయినా అంతగా పట్టించుకోనివాళ్లు చాలామందే వున్నా.. కొంతమంది మాత్రం తెగ ఫీలయిపోయి దేవదాసులా మారిపోతుంటారు. ఇంట్లోవాళ్లను పట్టించుకోకుండా తమ మత్తులోకంలో మునిగిపోతుంటారు. అటువంటివారిని ఉద్దేశించే ఈ షార్ట్ ఫిలింని రూపొందించారు.