సీన్ ఓపెన్ చేయగానే.. ఒక బీచ్ ఏరియా! అక్కడ నితీష్ అనే అబ్బాయి సిగరెట్ తాగుతూ నిల్చుంటాడు. అప్పుడే గీత అనే అమ్మాయి వెనుకనుంచి వచ్చి.. అతనికి సారి చెప్పి ఐలవ్ యూ అంటుంది. కానీ అతడు తిరస్కరిస్తాడు. దీంతో నిరాశచెందిన గీత నిద్రమాత్రలు మింగేస్తుంది. కట్ చేస్తే.. ఫ్లాష్ బ్యాక్! మూడునెలల క్రితం గీత తన వెహికల్ లో వెళ్తుండగా దారిలో పెట్రోల్ అయిపోతుంది. సహాయంకోసం దారిలో చాలామందిని ఆపడానికి ట్రై చేస్తుందికానీ.. ఎవ్వరు నిలబడరు. ఆ సమయంలో నితీష్ అక్కడకు చేరుకుంటాడు. గీత పెట్రోల్ కావాలంటూ అడిగితే.. మనోడు ఏమీ ఆలోచించకుండా ఇచ్చేస్తాడు. అందమైన అమ్మాయి కదా.. ఎందుకు వదులుకోవాలనుకుని మనోడు డీటైల్స్ అన్నీ తన తెలివితో ఎలాగోలా లాగేస్తాడు.
అయితే ఫోన్ నెంబర్ దగ్గర అసలు విషయం తెలుసుకుని గీత అక్కడినుంచి వెళ్లిపోతుంది. అప్పటినుంచి మనోడు గీతను పడగొట్టేందుకు ఎంతగానో ప్రయత్నిస్తాడు. అయితే తనను ఎలాగైనా వదులుకోవాలనుకున్న గీత.. తన గత ప్రేమ గురించి అతనికి చెబుతుంది. అప్పుడు శిరీష్ గుండె ధఢేల్ మంటూ పగిలిపోద్ది. అయితే అతడెవరో తెలుసుకోవాలని డీటెయిల్స్ అడుగుతాడు. అప్పుడు గీత లవ్ ఎఫైర్ ఫ్లాష్ బ్యాక్! ఆమె తన ఫ్లాష్ బ్యాక్ చెప్పిన తర్వాత మనోడు ఆమె చెంప మీద కొట్టి అక్కడినుంచి వెళ్లిపోతాడు. అసలు శిరీష్ తాన ప్రేమిస్తున్న గీతను ఎందుక్కొట్టాడు..? గీత అతనికి ఏం చెప్పింది..? వీళ్ల లవ్ స్టోరీ మధ్యలో ఎవరైనా వున్నారా..? వీళ్లిద్దరూ ప్రేమించుకుంటారా..? మొదటి సీన్ లో గీత నిద్రమాత్రలు మింగేసిన తర్వాత బ్రతుకుతుందా..? ఇంతకీ కథలో అసలు ట్విస్ట్ ఏంటి..? అన్న కోణంలో చిత్రాన్ని రూపొందించారు.
సాధారణంగా ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు.. అబ్బాయిలు ప్రేమంటూ ఓ ఎగేసుకుని వాళ్ల వెంట పడుతారు. వాళ్ల గురంచి ఏమీ తెలుసుకోకుండా లవ్ మీ అంటూ నినాదాలు చేసుకుంటూ తిరుగుతారు. అయితే అందులో కొంతమంది అమ్మాయిలు వాళ్ల ప్రేమను తిరస్కరిస్తే.. మరికొంతమంది మాత్రం అంగీకరిస్తారు. ఇదిలావుండగా.. అమ్మాయిల వెంటపడుతున్నాడు కదా అని ప్రతిఒక్క అబ్బాయి వెధవ కాడు.. తన నిజమైన ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలియక పిచ్చపిచ్చ చేష్టలు చేస్తుంటారు. అది తెలియని అమ్మాయిలు వాళ్ల ప్రేమను తిరస్కరిస్తారు. అదే కోణంలోనే ఈ షార్ట్ ఫిలింని తెరకెక్కించారు. ఇందులో వున్న కామెడీ ఎలిమెంట్స్ బాగానే ఆనందపరుస్తాయి. ఇది ఒక కామెడీ, స్వీట్ లవ్ స్టోరీ!