ఒక మెకానికల్ షాప్’లో అందమైన అమ్మాయి. ఆమె పేరు చైత్ర! తన బైక్ పాడైందని రిపేర్ చేయించుకోవడానికి ఆ షాప్’కు వెళ్లి వుంటుంది. అప్పుడే.. ఇంటర్వ్యూ కోసమని ఫోన్ వస్తుంది. దాంతో తన ఇష్టమైన బండిని వదిలేసి ఇంటర్వ్యూ కోసం వెళ్తుంది. కట్ చేస్తే.. కాఫీ షాప్! అక్కడ రిక్రూటర్ (హెచ్ఆర్ వెంకట్) ఒక అబ్బాయికి ఇంటర్య్వూ తీసుకుంటుంటాడు. అదే సమయంలో చైత్ర అక్కడికి చేరుకుంటుంది అతని దగ్గర ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా.. ఆమె చూస్తుంది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే.. ఒకరికొకరు ఇంతకుముందే తెలుసు! చైత్రకి వెంకట్ అంటే అసహ్యం!
ఇక ఫ్లాష్ బ్యాక్.. 12 సంవత్సరాల క్రితం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. ఒక స్కూల్ లో చైత్రకి, వెంకట్’కి పరిచయం అవుతుంది. వారిద్దరి మధ్య అనుకోకుండా సంభాషణ ఏర్పడుతుంది. అప్పుడు మ్యాథ్స్ లో వీకైన చైత్ర.. వెంకట్ తనకు బాగా వచ్చని చెబుతాడు. అయితే మ్యాథ్స్ పరీక్షనాడు అతనికి రాదని చైత్రకి తెలిసి షాక్ తింటుంది. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు! తిరిగి మళ్లీ నార్మల్ పొజిషన్! అప్పుడు చైత్రను తాను ప్రేమిస్తున్నానని వెంకట ఎంత చెప్పినా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరి వాళ్లిద్దరు కలుసుకుంటారా..? లేదా..? అనే అంశంపై ఈ షార్ట్ ఫిలింని రూపొందించారు.
లవ్ ఆల్’జీబ్రా.. ఒక స్వీట్ లవ్ స్టోరీ! మొత్తం షార్ట్ ఫిలింని చాలా అందంగా తెరకెక్కించారు. చూస్తుండగా ఇంట్రెస్టింగ్ గా వుంటుంది కానీ.. ఎక్కడా బోర్ కొట్టే సన్నివేశాలు లేవు. ఇక నటీనటుల విషయానికొస్తే.. అందరూ బాగానే యాక్ట్ చేశారు. మొత్తానికి ఈ చిత్రం బాగానే వుందని చెప్పుకోవచ్చు.