అనుకోకుండా ఒకరోజు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఎదురెదురుగా నడుచుకుంటూ వస్తూ.. చూసుకోకుండా గుద్దుకుంటారు. దాంతో వాళ్ల చేతుల్లో వున్న పుస్తకాలు పడిపోతాయి. అప్పుడు ఒకరినొకరు సారీ చెప్పుకొని వెళ్లిపోతారు. కట్ చేస్తే.. 8 నెలల తర్వాత మళ్లీ అదే స్థానంలో కలుసుకుంటారు.. ఈ నేపథ్యంలో ఇద్దరు బాగా దగ్గరైపోతారు. అమ్మాయిని ప్రపోజ్ చేయాలనే ఉద్దేశంతో ఒకరోజు తన చేతిలో పువ్వు పట్టుకుని వస్తాడు. అమ్మాయిని ప్రపోజ్ చేస్తాడు. అందుకు అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది. కానీ అదే సమయంలో అమ్మాయి తండ్రి అక్కడికి చేరుకుంటాడు. తండ్రిని చూసి అమ్మాయి భయపడిపోతుంది. అప్పుడా తండ్రి అబ్బాయిని కొట్టి తన కూతురుని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాడు.
అయితే అబ్బాయి వారిని అడ్డుకొని.. తన కూతుర్ని తనకిచ్చి పెళ్లిచేయాలంటూ కోరతాడు. కానీ అమ్మాయి తండ్రి మాత్రం తన కూతుర్ని పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చి పెళ్లి చేస్తానని చెబుతాడు. దాంతో ఆ అబ్బాయి కన్ ఫ్యూజన్ లో మునిగిపోతాడు. అప్పుడు తన మదిలో మూడు ఆలోచనలు మెదులుతాయి.. ‘‘ప్రేమకోసం మరణించినవాళ్లున్నారు... చంపినవాళ్లున్నారు... చరిత్రలో మిగిలిపోయినవాళ్లున్నారు... నేను చంపాలా.. చనిపోవాలా.. చరిత్రలో నిలిచిపోవాలా..?’’ అంటూ సందేహాల్లో మునిగిపోతాడు. మరి ఆ అబ్బాయి తన ప్రేమను నిలబెట్టుకోలేకా అమ్మాయిని చంపుతాడా..? లేక చనిపోతాడా..? లేక అమ్మాయి తండ్రి చెప్పిన విధంగా పోలీస్ ఆఫీసర్ గా మారి తన ప్రేమను గెలుచుకుంటాడా..? అన్న కోణంలో ఈ షార్ట్ ఫిలింని రూపొందించారు.
ప్రస్తుత జనరేషన్లో లవర్లు లేని అమ్మాయిలు, అబ్బాయిలు అస్సలు వుండరు. అందులో కొందరివి సక్సెస్ అయితే.. మరికొందరిని ఫెయిల్ అవుతాయి. అయితే లవ్ ఫెయిల్యూర్ అయినవాళ్లలో కొంతమంది బాధతో ఏం చేస్తున్నారోనన్న ధ్యాస కూడా వుండకూడదు. తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం పిచ్చిపిచ్చి పనులు చేస్తుంటారు. కొంతమందైతే తమ ప్రేయసి వేరొకరికి దక్కే అవకాశం లేదనే మొండితో ప్రాణాలు తీయడం లేదా తీసుకోవడం చేస్తుంటారు. అమ్మాయి తరఫున తల్లిదండ్రులు విధించిన లక్ష్యాలను పూర్తి చేయలేక నానాతంటాలు పడుతుంటారు. అటువంటి పరీక్షల్లో కేవలం కొంతమంది మాత్రమే పాస్ అవుతారే తప్ప.. మిగతావాళ్లందరూ తుస్సుమంటారు. దాంతో మరీ ఫ్రెస్ట్రేషన్ కు వెళ్లిపోయి చంపడమో, చావడమో చేస్తుంటారు. అయితే అటువంటి చావుదార్లు వెతుక్కోకుండా ఎంతకాలం అయినా సరే.. లక్ష్యాన్ని సాధించి తమ ప్రేమను గెలిపించుకోవడంలో నిజమైన ప్రేమ అని మెసేజ్ ఇచ్చే నేపథ్యంలోనే దీనిని రూపొందించారు.