• చిత్రం  :

    ఆర్య -3

  • బ్యానర్  :

    ఈశ్వర్ ఎంటర్ టైన్ మెంట్స్

  • దర్శకుడు  :

    ఈశ్వర్ రెడ్డి గాయం

  • నిర్మాత  :

    ఈశ్వర్ రెడ్డి, సందీప్ రెడ్డి, క్రిష్ణ

  • సంగీతం  :

    పీవీఆర్ రాజా

  • ఛాయాగ్రహణం  :

    దీపు రెడ్డి, సందీప్ బద్దుల

  • ఎడిటర్  :

    భరత్ రెడ్డి

  • నటినటులు  :

    మాస్టర్ సిద్ధార్థ్, మాస్టర్ జ్ఞాన్ సాయి, బేబీ వైష్ణవి, బేబీ ప్రీతి, కెఎస్ చరణ్, సాగరిక, పటమటలంక నవీన్

Arya 3 Telugu Short Film Movie Review
Cinema Story

ఆర్య అనే చిన్న అబ్బాయి ప్రతిరోజూ తన గర్ల్ ఫ్రెండ్ గీత కోసం చాక్లెట్స్ కొనిస్తుంటాడు. అయితే ఒకరోజు తన దగ్గర డబ్బుల్లేక గీతకు చాకొలెట్ కొనివ్వకపోవడంతో.. ఆ అమ్మాయికి అజయ్ అనే అబ్బాయి కొనిస్తాడు. దాంతో అమ్మాయి అతనివెంటే వెళ్లిపోతుంది. దాంతో గీతను ఎలాగైనా తిరిగి పొందాలని ఆర్య అనుకుంటాడు. కానీ చాకొలెట్స్ కొనివ్వడానికి తన దగ్గర డబ్బుల్లేక ఊరికే వుండిపోతాడు. కట్ చేస్తే... హీరోయిన్ సాగరిక ఎంట్రీ ఇస్తుంది. బస్ స్టాప్ దగ్గర ఆగివున్న ఒక అమ్మాయికి చాకొలెట్స్ ఇస్తుంటుంది. ప్రతిరోజూ సాగరికను ఆ బస్ స్టాండ్ దగ్గర చూస్తూ చరణ్ ప్రేమలో పడిపోతాడు. తన మనసులో మాటను సాగరికకు వివరిస్తాడు. అయితే ఆమె ప్రేమను అంగీకరించదు. ఇలా స్కూలుకెళ్లే అబ్బాయి ఆర్య, చరణ్ ప్రేమలు బస్ స్టాప్ దగ్గరే ఆగిపోతాయి. మరి వాళ్లిద్దరూ తమ ప్రేమను దక్కించుకుంటారా..? ఆర్య సినిమాలాగే ఇందులో సరికొత్తగా ట్విస్టులేమైనా వుంటాయా..? అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

cinima-reviews
ఆర్య - 3

‘‘ప్రేమించడం సులభమే కానీ.. ప్రేమను గెలిపించుకోవడం అసాధ్యం. ప్రేమను గెలిపించుకోవాలంటే ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది... తమ విలువైన సమయంతోపాటు వ్యక్తిగత జీవితాన్ని వదులుకుని అమ్మాయికి తమ ప్రేమ విలువను తెలియపరచాలి. అప్పుడే ఆ అమ్మాయి నమ్మకంతో ప్రేమిస్తుంది’’ అనే కాన్సెప్ట్ తోనే ఈ చిత్రాన్ని రూపొందించారు. ఒక స్కూల్ జంట, ఒక టీనేజ్ జంట మధ్య ఒక స్వీట్ లవ్ స్టోరీని క్రియేట్ చేసి.. దానిని బాగానే ప్రెజెంట్ చేశారు. ‘‘ప్రేమ’’ అనే వర్డ్ తోనే షార్ట్ ఫిలిం ను మొదటినుంచి చివరిదాకా రకరకాల ట్విస్టులుగా తెరకెక్కించారు.