Film Jokes
సినిమా ప్రొడ్యూసర్ నేనే కాబట్టి

‘‘బాబుగారు.. ఈరోజు రాత్రి టీవీలో రాబోయే సినిమాని చూడొచ్చా’’ అని అడిగాడు పనివాడు. 

‘‘ఇదేం కోరికయ్యా... టీవీలో వచ్చే సినిమా గురించి నన్నుడుగుతావేంది’’ అని అన్నాడు ఇంటి యజమాని. 

‘‘ఇరవై సంవత్సరాలక్రితం ఆ సినిమాని తీసింది నేనే బాబూ’’ అని అన్నాడు పనివాడు. 

సినిమా టైటిళ్ళు..

వెంకట్రావ్ సాఫ్ట్ వేర్ నిపుణుదు. ఆయన రిజిష్టర్ చేయించిన సినిమా టాటిల్స్ ఇవీ..

శంకరదాదా M.C.A

చాట్టింగ్ చేద్దాం రా

ప్రోగామర్ నెం. 1

వైరస్ స్టోరీ

ఎవడి సిస్టమ్ వాడిదే

సంపూర్ణ "జావా"యణం

హ్యాకర్లకు మునగాడు

సాఫ్ట్ వేర్ చిన్నోడు

హ్యాకిరి

80 జీబీ....

డాట్‍కాం కాలనీ

ఆపరేషన బిల్ గేట్స్

సీ ప్రోగ్రాం రహస్యాలు

మెమరీలో ఆమె జ్ఞాపకాలు

పాస్‍వార్డ్ లేని చిన్నది..

నాన్ననువ్వు నాకు నచ్చావ్..

నాన్న... గుర్తు చేసుకోవడానికి వంశం ఇచ్చావ్....

కొట్టుకోవడానికి పెద్ద పెద్ద తొడలు ఇచ్చావ్....

జనాలని హింసించదానికి దిక్కుమాలిన సినిమాలనిచ్చావ్....

మమ్మల్ని భరించడానికి నిర్మాతలనిచ్చావ్....

ఏమైనా చేసుకోవడానికి విజయశాంతినిచ్చావ్....

మాలో మేము తన్నుకోవడానికి చానా తోబుట్టులనిచ్చావ్....

నాన్న....(ఏడుపు కళ్ళతో) పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న అక్కా బావల నిచ్చావ్....

అడక్కుండానే పిన్నిని ఇచ్చావ్.... ఎలాంటి నినిమాలు తీసినా భరించే అభిమానులనిచ్చావ్....

చివరకొస్తే.... నిర్మాతలని కాల్చేయడానికి గన్నిచ్చావ్....

కానీ ఎందుకు నాన్నా ఇంత తొందరగా చచ్చావ్....

అయినా నువ్వు నాకు నచ్చావ్....