ఒకరోజు బాలకృష్ణ తన బరువును తగ్గించుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.
బాలకృష్ణ : ‘‘డాక్టర్ గారూ.. నేను బరువు తగ్గాలనుకుంటున్నా.. ఏం చేయాలో చెబుతారా?’’
డాక్టర్ : ‘‘అలా అయితే మీరు రోజూ 8 కిలోమీటర్ల వరకు పరుగెత్తాలి. అలా 300 రోజులు పరుగెత్తితే 34 కిలోగ్రాముల బరువును తగ్గించుకోవచ్చు’’ అని చెబుతాడు.
దాంతో బాలయ్య తన పరుగును మొదలుపెడతాడు.
మొత్తం 300 రోజుల తరువాత బాలకృష్ణ తన బరువును తగ్గించుకొని.. డాక్టర్ ను పిలుస్తాడు.
బాలకృష్ణ : ‘‘డాక్టర్ గారు నేను నా బరువును తగ్గించుకున్నా.. మీరు ఒకసారి వచ్చి నన్ను చెకప్ చేయండి.. కానీ ఒక చిన్న ప్రాబ్లమ్!’’
డాక్టర్ : ‘‘ఏంటి ఆ ప్రాబ్లమ్?’’
బాలకృష్ణ : ‘‘నేను ఇప్పుడు ఇంటి నుంచి 2400 కిలోమీటర్ల దూరంలో వున్నా’’