ఒకరోజు ఒక హీరో కథలు చదవడానికని ఒక గ్రంథాలయానికి వెళతాడు.
అక్కడున్న చాలా పుస్తకాలను చూసి.. కొద్దిసేపు ఆలోచిస్తాడు. తరువాత అందులో నుంచి ఒక పుస్తకాన్ని తీసుకుంటాడు.
అందులో కథ ఎలా వుంటుందా అని పుస్తకం మొత్తం అయిపోయేంతవరకు చదివాడు.
అయిపోయిన తరువాత హీరో ఆ గ్రంథాలయంలో వున్న లైబ్రేరియన్ కి పుస్తకాన్ని ఇస్తూ.. ఇలా అంటాడు.
హీరో : ఈ బుక్ లో కేవలం క్యారెక్టర్స్, వాళ్ల ఫోన్ నెంబర్లు తప్ప స్టోరీ ఏమీ లేదు. ఏ వెధవ రాశాడో!
అక్కడున్న లైబ్రేరియన్ ఒక్క సెకను కూడా ఆలోచించకుండా హీరో చెంప మీద ఛెళ్లుమని వాయిస్తాడు. తరువాత ఇలా అంటాడు.
లైబ్రేరియన్ : ఓరీ నీచుడా, నికృష్టుడా, తెలివిలేని వెధవ... టెలిఫోన్ డైరెక్టరీలో నీకు స్టోరీ ఎక్కడి నుంచి వస్తుందిరా దద్దమ్మ. నువ్వు ఈ జన్మలో మారవురా బాబు.