ఒకసారి సోనియా గాంధీ కౌన్ బనేగా కరోడ్ పతి షోలో గేమ్ ఆడడానికి వెళుతుంది.
అమితాబ్ గారు ఎన్నో ప్రశ్నలు వేయగా.. సోనియా వాటన్నింటికీ సమాధానాలు చెబుతూ.. చివరి ప్రశ్న వరకు చేరుకుంటారు. అప్పుడు...
అమితాబ్ బచ్చన్ : సోనియాగారు.. ఇప్పుడు నేను 5 కోట్ల విలువచేసే చివరి ఆఖరి ప్రశ్నను అడగబోతున్నాను!
ప్రశ్న: గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు?
ఏ) లాలూ ప్రసాద్ బి) విలాస్ రావ్ దేశ్ ముఖ్ సి) అర్జున్ సిన్హ్ డి) నరేంద్రమోదీ
సోనియా గాంధీ : డి) నేంద్రమోదీ!
అమితాబ్ బచ్చన్ : మీరు చెప్పింది నిజమేనని మీరు నమ్ముతున్నారా?
సోనియాగాంధీ : అవును.. నేను చెప్పిన దానిలో చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను?
అమితాబ్ బచ్చన్ : అలా అయితే నరేంద్రమోదీని లాక్ చేసేయమంటారా?
సోనియాగాంధీ : మీరు అతన్ని లాక్ చేస్తే.. దానికి బదులుగా నేనే మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తాను!