ఒకరోజు సర్దార్ ఎన్నో టెన్షన్ లతో ఒక డాక్టర్ దగ్గరకు వెళతాడు. అప్పుడు సర్దార్ డాక్టర్ తో ఇలా అంటాడు.
సర్దార్ : ‘‘డాక్టర్ గారు..! మా పక్కింటివారి ఇంట్లో చాలా కుక్కలున్నాయి. అవి రాత్రింబవళ్లు మొరుగుతూనే వుంటాయి. దానివల్ల నేను ఒక్క క్షణం కూడా సుఖంగా నిద్రపోలేకపోతున్నా...
డాక్టర్ : ‘‘ఇంత చిన్న విషయానికే టెన్షన్ ఎందుకు దండగా..! నేను నీకు బాగా నిద్ర వచ్చేందుకు మంచి మాత్రలు ఇస్తాను. అవి తీసుకోవడం వల్ల నువ్వు ఎంత గాఢ నిద్రలోకి వెళ్లిపోతావంటే.. పక్కింట్లో కుక్కలున్నాయనే సంగతి మర్చిపోతావు. ఇవిగో తీసుకో’’.. అని చెప్పి మందులు ఇస్తాడు.
సర్దార్ ఆ మందులను తీసుకుని వెళతాడు.
కొన్ని రోజుల తరువాత సర్దార్ మునుపటికంటే ఇంకా ఎక్కువ టెన్షన్ తో డాక్టర్ దగ్గరకు వస్తాడు.
సర్దార్ : ‘‘డాక్టర్ గారూ... మీరు ఇచ్చిన సలహా పనిచేయలేదు. ముందుకంటే ఎక్కువగా నేను అలసిపోతున్నాను.’’
డాక్టర్ : ‘‘అరె.. ఇలా అస్సలు జరగకూడదే.. నేను నీకు ఇచ్చిన మందులు చాలా మంచివి. సరే ఈసారి వాటికంటే ఇంకా మంచి మందులిస్తాను’’
సర్దార్ : ‘‘ఇవి నిజంగానే పనిచేస్తాయా! కానీ రాత్రంతా కుక్కలు పట్టుకోవడానికే నా సమయం సరిపోతుంది. ఒకవేళ ఒకటీ లేదా రెండు పట్టుకుంటే... వాటికి ఈ మాత్రలు తినిపించడానికి నానా కష్టాలు పడాలి’’
ఇది విన్న తరువాత డాక్టర్ క్లీన్ బౌల్డ్.