ఒకరోజు పప్పు తన ఇంటి పక్కనే వున్న ఒక ఆంటీ ఇంటికి వెళతాడు.
డోర్ బెల్ కొట్టగానే ఆ ఇంట్లో వున్న ఒక మహిళ బయటకు వచ్చి పప్పును చూస్తుంది. అప్పుడు
మహిళ : అరె పప్పు.. ఏమైంది? ఎందుకు డోర్ బెల్ కొట్టావ్? ఏమైనా కావాలా?
పప్పు : ఆంటీ.. అమ్మ ఒక గిన్నెడు చెక్కెర మీతో ఇప్పించుకో రమ్మని చెప్పింది.
అప్పుడు ఆ మహిళ నవ్వుకుంటూ పప్పు తో ఇలా అంటుంది.... ‘‘అవునా.. సరే మీ అమ్మ ఇంకేమి చెప్పింది?’’
పప్పు : అమ్మ ఏమని చెప్పిందంటే.. ‘‘ఒకవేళ ఆ డాయన్ చెక్కెర ఇవ్వకపోతే.. ముందరున్న ఆ రాక్షసి నుంచి తీసుకుని రా’’ అని చెప్పింది!