ఓ రోజు స్కూల్ లో టీచర్ అందరి విద్యార్థుల బర్త్ డే వివరాలు అడిగి తెలుసుకుంటోంది.
అందరినీ వరుసగా అడుగుతున్న క్రమంలో బుజ్జిగాడి పేరు వస్తుంది. అప్పుడు..
టీచర్ : ‘నీ పుట్టిన రోజు ఎప్పుడు బుజ్జి’ అని అడిగింది.
బుజ్జి : ‘జులై 19వ తేదీన టీచర్’ అని చెప్పాడు.
టీచర్ : ‘ఏ సంవత్సరం రా?’ అని ప్రశ్నించింది.
బుజ్జి : ‘ప్రతి సంవత్సరం టీచర్’ అని ఠక్కున సమాధానం చెప్పాడు.
దాంతో టీచర్ అవాక్కవగా.. మిగతా విద్యార్థులు నవ్విపడేశారు.
ఒకరోజు సీత, గీత అనే ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు.
మొదట తమ స్థితిగతుల గురించి చర్చించుకున్న తర్వాత పిల్లల గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే తమ పిల్లలు చేసే అల్లరి, ఇతర వ్యవహారాల గురించి చర్చించుకున్నారు.
అప్పుడు గీతను సీత ఓ ప్రశ్న వేసింది.
సీత : మీ అబ్బాయి నిద్రలో నడిచే అలవాటు మానేశాడటగా..! చాలా సంతోషం!
గీత : ఏం సంతోషం? కాళ్లు లాగుతున్నాయని ఇపుడు నిద్రలో సైకిల్ తొక్కుతున్నాడు.
అని గీత చెప్పగానే సీత ఒక్కసారిగా నవ్వేసింది.
విద్యార్థి : నిన్న ప్రమీల క్లాసులో నిద్రపోయింది మేడమ్...
టీచర్ : మరి నిన్ననే ఎందుకు చెప్పలేదురా బడవా...
విద్యార్థి : అప్పుడు మీరు కూడా నిద్రపోతున్నారు మేడమ్..!!
ఒక నెల తర్వాత కుమార్ అనే వ్యక్తి తన ఫ్రెండ్ అయిన రమేష్ ని కలిశాడు.
ఆ సందర్భంగా వారిద్దరి మధ్య తమ భార్యల గురించి ప్రస్తావన వచ్చింది.
కుమార్ : మా ఆవిడ నాతో గత నెల రోజులుగా గొడవపడడం లేదు. (ఆనందంగా చెప్పాడు).
రమేష్ : అవునా..? గొడవ పడకుండా వుండేందుకు ఆమెతో ఏమన్నావేమిటి?
కుమార్ : నువ్వు కోప్పడినప్పుడల్లా నీ ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయని నా భార్యతో అన్నానంతే! (మరింత ఆనందంగా చెప్పాడు)
ఒకరోజు రాత్రి 20 నుంచి 25 సంవత్సరాల మధ్యనున్న ఒక అబ్బాయి హైదరాబాద్ నగర వీధుల్లో తిరుగుతుంటాడు.
అలా నడుస్తూ వుండగా.. కొంతదూరం వెళ్లిన తరువాత పుట్ పాత్ లో ఒంటిమీద బట్టలు లేకుండా కేవలం చడ్డీ మాత్రమే వేసుకుని కూర్చున్న ఒక మనిషిని చూస్తాడు.
అతనిని చూసిన వెంటనే ఆ అబ్బాయికి అతని మీద దయ కలుగుతుంది. దాంతో అతను 50 రూపాయలు ఆ మనిషికి ఇవ్వాలని దగ్గరగా వెళతాడు.
తను డబ్బులు ఇచ్చిన వెంటనే ఆ వ్యక్తి ముందుగా వాటిని చూసి, నిశ్శబ్దంగా నిలబడుతాడు. అనుకోకుండా చాలా గట్టిగా ఆ అబ్బాయి చెవికింద ఒక పెద్ద మోతా వాయిస్తాడు (చెంపదెబ్బ కొడతాడు).
అలా కొట్టగానే ఆ అబ్బాయి ఒక్కసారిగా బెంబేలెత్తిపోయి, తత్తిరిబిత్తిరిగా అతనివైపు చూస్తాడు.
అప్పుడు ఆ వ్యక్తి అబ్బాయితో ఇలా అంటాడు... ‘‘అక్కడ ముందరున్న ఒక ఫ్లాట్ కనిపిస్తోందా..? అది నాదే! ఇంట్లో విద్యుత్ (కరెంట్ లేదా పవర్) లేకపోవడం వల్ల ఇలా బట్టలు లేకుండా బయట కూర్చోవాల్సి వచ్చింది’’!
ఈ మాటలు వినగానే అబ్బాయి ఒకేసారి కోమాలోకి వెళ్లిపోతాడు.
ఒక వ్యక్తి తన డబ్బులను తీసుకోవడానికి ఫ్రెండ్ ఇంటికి వెళతాడు. డోర్ బెల్ మోగించగా.. ఆ శబ్దాన్ని విని ఒక పిల్లాడు బయటకు వస్తాడు.
వ్యక్తి : బాబు.. మీ నాన్న ఇంట్లో వున్నారా..?
పిల్లాడు : లేదు అంకుల్.. నాన్న ఏదో కొనుక్కోవాలనుకుని బయటకు వెళ్లారు.
వ్యక్తి : పోనీ మీ అన్నయ్య అయినా వుంటాడు కదా..? ఆయనను పిలువు!
పిల్లాడు : లేదంకుల్.. అన్నయ్య కూడా క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లాడు.
వ్యక్తి : కనీసం మీ అమ్మయినా ఇంట్లో వుంటింది కదా.. ఆమెనైనా పిలువు బాబు!
పిల్లాడు : అమ్మ కూడా కిట్టీ పార్టీకి వెళ్లింది. అందరూ రాత్రివరకు తిరిగి రారు.
(ఈ మాటలు వినగానే ఆ వ్యక్తి కోపాద్రిక్తుడై ఇలా అంటాడు...)
వ్యక్తి : మరి నువ్వెందుకు ఇంట్లో చచ్చావ్.. నువ్వు కూడా ఎక్కడైనా బయటకు వెళ్లిపోవచ్చు కదా!
పిల్లాడు : ప్రస్తుతం నేనుంది కూడా నా ఫ్రెండ్ ఇంట్లోనే!
ఇది విని ఆ వ్యక్తి పిచ్చోడిగా మారిపోయి అక్కడి నుంచి పారిపోతాడు.
ఒకరోజు టీచర్ ఒక స్టూడెంట్ ని ఈ విధంగా ప్రశ్నలు వేసి అడుగుతుంది.
టీచర్ : నెపోలియన్ ఏ యుద్ధంలో చనిపోయాడు.
స్టూడెంట్ : తన ఆఖరి యుద్ధంలో.
టీచర్ : స్వాతంత్ర్యత ఇచ్చే సమయంలో ఆ సంతకాన్ని ఎక్కడ చేశారు?
స్టూడెంట్ : పుస్తకంలోని ఆఖరి పేజీలో...
టీచర్ : విడాకులు తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి?
స్టూడెంట్ : పెళ్లి
టీచర్ : విజయాలు దక్కకపోవడానికి ముఖ్య కారణాలు ఏంటి?
స్టూడెంట్ : పరీక్షలు
టీచర్ : మీరు బ్రేక్ ఫాస్ట్ లో ఏమి తినలేరు?
స్టూడెంట్ : లంచ్ అండ్ డిన్నర్
టీచర్ : సగంగా కోసిన ఆపిల్ ఆకారంలో ఏం కనిపిస్తుంది?
స్టూడెంట్ : దాని రెండవ సగభాగం
టీచర్ : ఒకవేళ మీరు నీలసముద్రంలో ఒక ఎర్రని రాయి విసిరితే అది ఎలా మారిపోతుంది?
స్టూడెంట్ : అప్పుడు ఆ రాయి తడిగా మారిపోతుంది.
టీచర్ : ఎవరైనా ఒక వ్యక్తి ఎనిమిది రోజుల వరకు నిద్రపోకుండా ఎలా వుండగలుగుతాడు?
స్టూడెంట్ : ఇందులో ఎటువంటి సమస్య లేదు.. అతను రాత్రి వేళలో నిద్రపోతాడు.
టీచర్ : నువ్వు ఏనుగును ఒక చేత్తో ఎలా ఎత్తగలుగుతావు?
స్టూడెంట్ : కేవలం ఒక చేయి మాత్రమే వున్న ఏనుగు మీకు ఎక్కడా దొరకదు?
టీచర్ : ఒకవేళ ఒక గోడను ఎనిమిది మంది కలిసి 10 గంటలలో నిర్మిస్తే.. అదే గోడను 4 వ్యక్తులు కలిసి ఎంత సమయంలో తయారుచేస్తారు?
స్టూడెంట్ : కొంచెం కూడా నిర్మించలేరు? ఎందుకంటే గోడను ఇంతకుముందే నిర్మించేశారు కాబట్టి.