ఒకరోజు భర్త వేటకు వెళ్లడానికి గన్ తీసుకుని సిద్ధంగా వుంటాడు. అప్పుడు
భర్త : డార్లింగ్ నేను వేటకు వెళుతున్నాను. bye.. bye..
భార్య : త్వరగా వెళ్లి రండి.. నేను మీకోసం భోజనం తయారుచేసి పెడతాను.
అని భార్య భర్తతో అంటూ... కిచెన్ లో నుంచి బయటకు వస్తుంది.
భర్త వెళ్లకుండా డోర్ దగ్గరే నిలబడి వున్నాడు. అప్పుడు
భార్య : నువ్వు ఇక్కడ ఎందుకు నిలబడ్డావు. వేటకు వెళతానని చెప్పావుగా..!
భర్త : అవును వేటకు వెళ్లడానికే సిద్ధమయ్యాను. కానీ...!
భార్య : మరి వెళ్లు.. మళ్లీ ఈ కానీ ఏంటి?
భర్త : ఎలా వెళ్లాలి... ఇంటి బయట కుక్క నిలబడి వుంది.