బీమా కంపెనీలకు చెందిన ముగ్గురు సేల్స్ మేన్ వ్యక్తులు.. తమతమ కంపెనీల సేవా కార్యక్రమాల గురించి చర్చించుకుంటుంటారు.
మొదటివాడు : మా కంపెనీ సర్వీస్ ఎంత వేగంగా పనులను నిర్వర్తిస్తుందంటే... ఒక వ్యక్తి సోమవారంనాడు మరణిస్తే.. మా కంపెనీవారు బుధవారం రోజే అతని కుటుంబసభ్యులకు మొత్తం పరిహారాన్ని చెల్లించేసింది.
రెండవవాడు : ఇందులో వేగం ఎక్కడుంది. ఫాస్ట్ గా పనిచేయడంలో మా కంపెనీయే ముందుగా వుంటుంది. మా కంపెనీవారు వ్యక్తి చనిపోయిన సాయంత్రానికే అతని ఇంటికి వెళ్లి.. వారికి చెందాల్సిన మొత్తం పరిహారాన్ని ఇచ్చేసింది.
మూడవవాడు : ఇక చాలించండి మీ కంపెనీల వేగ ప్రతాపాలు! మీరిద్దరూ చెప్పినదాంట్లో అసలు అర్థమే లేదు. ఇటువంటి విషయాలలో మా కంపెనీయే చాలా ఫాస్ట్ గా వుంటుంది. మా ఆఫీస్ వుండేది 10వ అంతస్తులో. అదే బిల్డింగ్ లోని 30వ అంతస్తులో వుండే ఒక వ్యక్తి కిటికీలను శుభ్రం చేస్తుండగా కిందకు పడిపోతుండగా... 10వ అంతస్తులో వున్న మా ఆఫీసు దగ్గరికి చేరుకోగానే అతనికి చెందాల్సిన మొత్తం డబ్బుల చెక్ ను అతని చేతిలో పెట్టేసింది!