మొదటి లేడీ : ‘‘నా భర్త వెంట్రుకలు చాలా నల్లగా వుంటాయి. అందుకే నేను ఆయనతో బయటకు వెళ్లేటప్పుడు నల్లచీర కట్టుకోవడం ఇష్టపడతాను’’
రెండవ లేడీ : ‘‘నా భర్త వెంట్రుకలు తెల్లగా వుంటాయి. అందుకే నేను ఆయనతో బయటకు వెళ్లేటప్పుడు తెల్లచీర కట్టుకోవడం ఇష్టపడతాను’’.
మూడవ లేడీ : ‘‘ఇక చాలించండి. నా భర్తకు అసలు వెంట్రుకలే లేవు. మరి నేనేం చేయాలి?’’.
"ఏమిటి పిన్నిగారు అంతకోపంగా ఉన్నారు?" శ్రామలమ్మను అదిగింది వరమ్మ.
"ఇవాళ ముచ్చటపది RTC Bus standలో weighing machine ఎక్కి రూపాయి నాణెం వేస్తే.......
ఒక్కసారే ఇద్దరు ఎక్కకూడదు అని వచ్చింది" కోపంగా అంది శ్యామలమ్మ.
అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ చెబుతున్నది తల్లి.
"చూడమ్మా... ముందు భోజనం నీ భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను" చివరి జాగ్రత్తగా చెప్పింది.
"ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా మమ్మీ" అన్నది ఆధునికతరం యువతి.
"ఈ మధ్య వస్తున్న టీవీ సీరియల్సేమైనా చూస్తున్నావా వదినా?"
"అబ్బే... ఈ సీరియల్స్‌తో విసుగెత్తిపోయింది. వాస్తవ జీవితమే ఎంతో హాయిగా ఉంది"
"వాస్తవ జీవితమా? ఎప్పుడు మొదలైంది? ఏ ఛానల్లో వస్తున్నది? ఎన్ని గంటలకొస్తున్నది?"