ఒకరోజు అత్త భోజనం చేద్దామనుకుని అన్నం తనే వడ్డించుకుంటుంది. అప్పుడు
అత్త : ‘‘ఏంటి కోడలా? బియ్యంలో రాళ్లు ఏరినట్లు లేవు... అన్నం తింటుంటే రాళ్లు వస్తున్నాయి.’’
కోడలు అత్తకు సమాధానం చెబుతూ...
కోడలు : ‘‘ఈరోజు నేను ఉపవాసం వున్నాను కదా అత్తమ్మా.. నేనెలాగో తినను కదా.. అందుకే ఏరలేదు’’
ఒకరోజు సుమిత్ర తన స్నేహితురాలైన అహల్యతో కలవడానికి వెళ్లింది.
సుమిత్ర : ‘‘పిల్లలు పుట్టడం లేదని మూడేళ్ల నుంచి డాక్టర్ వద్దకు వెళుతున్నా...
అహల్య : ఏమైనా ఫలితం వుందా.?
సుమిత్ర : మా ఆయన వల్ల కావడం లేదంటే... డాక్టర్ కూడా వేస్ట్ అనిపిస్తోంది.
ఈరోజు నాతో జరిగిన సంఘటన ఇంకెవరితో జరగకూడదని నేను అనుకుంటున్నా....
నేను ఉదయాన్నే లేచి టిఫిన్ చేశాను, పిల్లలకి తినిపించాను, భర్తకు వడ్డించాను.
అందరిని తయారుచేసి స్కూలుకు, ఆఫీసుకు పంపిచాను. సామాన్లు కడుక్కున్నాను. బట్టలు కూడా వాషింగ్ మెషిన్ దగ్గర పెట్టేశాను.
నేను బాత్ రూమ్ వెళ్లాను. స్నానం కూడా చేసే తయారు అయిపోయాను.
అప్పుడే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ లో విన్న మాటలకు నా ప్రాణాలుపోయేంత పని జరిగింది.
ఫోన్ లో మా ఇంటి పనిమనిషి... ‘‘అమ్మాగారూ! ఈరోజు నాకు జ్వరంగా వుంది. అన్ని పనులూ మీరే చేసుకోండి’’.
అత్త : ‘‘మా అత్తయ్య చిక్కారని మన పక్కింటివాళ్ళతో అన్నావటగా’’ అని అంది.
కోడలు : ‘‘నేను అలా అనలేదు అత్తయ్యా... మా అత్తయ్య కాస్త సన్నబడ్డారని చెప్పానంతే’’ అంది కోడలు
రమ్య : ‘‘హెలో పోలీస్ స్టేషన్..! మా ఇంటి తాళం పగలగొడుతున్నారు. నేనొక్కదాన్నే వున్నాను.. త్వరగా రండి’’ అంటుంది.
పోలీస్ : ‘‘మేడమ్ స్టేషన్లో నేనొక్కడినే వున్నాను.. రావడం కుదరదండి’’ అన్నాడు.
సుజాత : మీ ఆయన బావిలో పడి చనిపోయాడు కదా...
సవిత : అవునమ్మా...
సుజాత : మరి మీరు ఇప్పుడేం చేస్తారు.
సవిత : ఇకనుంచి నల్లా నీళ్లే గతి.
రమ : ‘‘నిన్న మీ ఆయన్ని ఎందుకు కొట్టావ్’’.
సంధ్య : ‘‘నవల చదువుతుంటే డిస్టర్బ్ చేశాడు. అందుకే కొట్టా’’
రమ : ‘‘ఇంతకీ ఏ నవల’’?
సంధ్య : ‘‘పతియే ప్రత్యక్ష దేవం’’.