వడ్డీవ్యాపారి తను అప్పిచ్చిన డబ్బులను వసూలు చేసుకోవడానికని ఒకరోజు వెంగుళప్ప అనే వ్యక్తి ఇంటికి వెళతాడు.
వడ్డీవ్యాపారి : ఒరేయ్ వెంగుళప్పా.. నువ్వు ఇంతవరకు నా అప్పు తిరిగి ఇవ్వలేదు. ఎప్పుడిస్తావ్?
వెంగుళప్ప : సరే.. తొందరగానే ఇచ్చేస్తాను. ఉద్యోగం చేస్తున్న మొదటి వేతనం రాగానే నీ మొత్తం డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను.
వడ్డీవ్యాపారి : అవునా! ఉద్యోగం వచ్చినందుకు నీకు చాలా శుభాకాంక్షలు. అయినా ఉద్యోగం ఎప్పుడు సంపాదించావ్?
వెంగుళప్ప : దొరికేస్తుంది.. చాలా తొందరగానే దొరికేస్తుంది! నేను అప్లికేషన్ వేయగానే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది.
వడ్డీవ్యాపారి : అంటే.. ఇంతవరకు నువ్వు అప్లికేషన్ వేయలాదా?
వెంగుళప్ప : అప్లికేషన్ అయితే పంపించేస్తా! కానీ సార్ అయితే ఇంకా పేపర్ మీద ఉద్యోగం గురించి విజ్ఞాపనం వేయిస్తానన్నారు. ఆ తరువాత నాకు అప్లికేషన్ పంపించమన్నారు.
వడ్డీవ్యాపారి : అంటే.. ఇంతవరకు ఉద్యోగం వుందని పేపర్ లో కూడా వేయలేదా?
వెంగుళప్ప : అలా కాదు.. సార్ ఏమంటున్నారంటే.. ఆఫీస్ లో ఉద్యోగాలు ఖాళీ అయితే నాకు లెటర్ పంపిస్తానన్నారు.
వడ్డీవ్యాపారి : అంటే.. ఇంతవరకు ఆఫీస్ లో ఉద్యోగాలు ఖాళీ లేవన్నమాట!
వెంగుళప్ప : ఇంకేముంది.. మొదట ఆ ఆఫీస్ లో వున్న క్లర్క్ ఉద్యోగం మానేయడానికి రెడీగా వున్నాడు. అతను వెళ్లగానే నేను అతని స్థానంలోకి వెళ్లిపోతాను.
(ఈ మాటలు విని వడ్డీవ్యాపారికి ఒక్కసారిగా చిర్రెత్తుకొస్తుంది. దీంతో అతను కోపంతో ఇలా అంటాడు...)
వడ్డీవ్యాపారి : ఆ అవును.. ఆ ఆఫీస్ లో వున్న క్లర్క్ కూడా వేరేచోట మంచి ఉద్యోగం దొరికినప్పుడు ఇందులో మానేస్తాడు కదా! అలాగే అతనికి ఆ మంచి ఉద్యోగం దొరకాలంటే ముందు ఆ ఆఫీస్ పనిచేసే మంచి క్లర్క్ తన ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లిపోవాలి. అతనికి కూడా ఎప్పుడైతే మంచి ఉద్యోగం వస్తుందో అప్పుడు మానేస్తాడు. ఇలాగే భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది కదా!
అని ఇలా వెంగుళప్పతో వడ్డీవ్యాపారి మొత్తం కథను అల్లుకుంటూ అల్లుకుంటూ చెబుతుంటాడు. దీంతో
వెంగుళప్ప : అరె. మీరు నిజంగానే తెలివి చాలా పెరిగిపోయిందే! నేను చెప్పుకుండానే మొత్తం మీరే అర్థం చేసుకున్నారు. నేను మీ దగ్గర అప్పు తీసుకుని చాలా మంచి చేశాను.
ఈ మాటలు వినగానే వడ్డీవ్యాపారి తన బట్టలు చించుకుని, తలజుట్టు పీక్కుని, గట్టిగా అరుస్తూ.. అక్కడి నుంచి పరుగులు తీశాడు.