వెంబనాడ్ వంతెన
దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే బ్రిడ్జి. కొచ్చి (కేరళ) వద్ద ఎడపల్లి - వల్లార్‌పాదం ఏరియాలను కలుపుతూ వెంబనాడ్ లేక్‌పై దీనిని నిర్మించారు. రూ. 350 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జి... నాలుగున్నర కిలోమీటర్ల పొడవు వుంటుంది. దీని నిర్మాణం జూన్ 2007లో ప్రారంభించగా.. 31 మార్చి 2010లో పూర్తయింది.