మెదక్ కోట
మెదక్ కోట తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ నరానికి ఉత్తరాన 300 అడుగుల ఎత్తైన కొండపై 400 ఎకరాల్లో విస్తరించబడింది మెదక్ కోట. ఈ కోటను క్రీ.శ. 12వ శతాబ్దంలో ప్రతాపరుద్రుడు కాలంలో నిర్మించారని ప్రతీతి. ప్రస్తుతం ఈ కోటలో 17వ శతాబ్దానికి చెందిన 3.2 మీటర్ల పొడవైన ఒక ఫిరంగి ఉంది. ఈ కోటలో పర్యాటకులు సుందర దృశ్యాలతోపాటు ఇంకా ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు.