దేవరకొండ కోట
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో దేవరకొండ పట్టణానికి దగ్గరలోనే ఈ ప్రాచీన కోట వుంది. ఈ దుర్గము ఏడుకొండల మధ్యన ఉంది. ఐదువందల ఎకరాలపైగా విస్తీర్ణం కలిగిన ఈ కోటలో కాలువలు, బావులు, సెలయేళ్ళు, కోనేరులు అందమైన భవనాలు, ఉద్యానవనాలు వున్నాయి. ధాన్యాగారము, సైనిక శిబిరాలు, ఆలయాలు వున్నాయి.