ఇంత వరకు భారత్ ఎన్నో టెస్టు సిరీస్ లు గెలిచింది. టెస్టుల్లో టాప్ జట్లను ఓడించింది. కానీ విండీస్ తో జరుగుతున్న ఈ టెస్టు సిరీస్ ఎంతో ప్రతిష్టాత్మకమైందని చెప్పాలి. ఎందుకంటే గత రెండు దశాబ్దాల నుండి క్రికెట్ అభిమానుల ఆరాధ్య దైవం అయిన మాస్టర్ బ్లాస్టర్ ఆడుతున్న చివరి సిరీస్. కాబట్టి అందరి చూపు దీని పైనే ఉంది.
సచిన్ ఫేర్ వెల్ సిరీస్ గా చెప్పుకుంటున్న ఈ సిరీస్ నిన్న కోల్ కత్తాలో ప్రారంభం అయింది. తొలి టెస్టులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విస్టిండీస్ పై మొదటి రోజు ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈడెన్ లో తొలి టెస్టు ఆడుతున్న 23 ఏళ్ల మహ్మద్ షమీ మెరుపు బంతులకు విండీస్ బ్యాట్స్ మెన్స్ బెంబేలెత్తించారు. విండీస్ బ్యాట్స్ మెన్స్ లో భారీ హిట్టర్లున్నా భారత బౌలర్ల ప్రదర్శన ముందు చేతులెత్తేశారు.
తొలి ఇన్నింగ్స్‌లో 78 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. శామ్యూల్స్ (65) ఒంటరిపోరాటం చేయగా, చందర్‌పాల్ (36), పావెల్ (28) ఓ మోస్తరుగా ఆడారు. 138/2 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న విండీస్ 96 పరుగుల తేడాతో చివరి 8 వికెట్లను కోల్పోవడం దెబ్బతీసింది.
షమీ నాలుగు వికెట్లతో ఆకట్టుకోగా, అశ్విన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆ తరువాత బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి ధావన్ (21 బ్యాటింగ్), విజయ్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలో వరుసగా నిలబడి సచిన్‌కు గౌరవ అభివాదం చేశారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more