Mahendra Singh Dhoni to team: You don't have to make mistakes to learn

Ms dhoni feels the last delivery was brilliant

MS Dhoni, India, India vs Zimbabwe, India vs Zimbabwe 2016, Zimbabwe-India tour 2016, T20 series, Mahendra Singh Dhoni, BCCI, cricket, cricket news

India captain Mahendra Singh Dhoni hopes the youngsters in the squad learn from their mistakes after a shock loss to Zimbabwe in the opening T20 International

అద్భుత ఓవర్.. చక్కని బంతి అందుకే ఓడాం..

Posted: 06/19/2016 02:57 PM IST
Ms dhoni feels the last delivery was brilliant

జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఓటమిపై టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. కుర్రాళ్లు నేర్చుకోవాల్సింది చాలా ఉందని అన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని మీడియాతో మాట్లాడాడు. 'ఏ జట్టుతో ఆడుతున్నామన్నాది ముఖ్యం కాదు. ప్రత్యర్థి కంటే బాగా ఆడుతున్నామా, లేదా అన్నదే ముఖ్యం. ఈ రోజు జింబాబ్వే మా కంటే మెరుగ్గా ఆడింది. బ్యాటింగ్, బౌలింగ్ లో పైచేయి సాధించింది. మంచి క్రికెట్ ఆడింది.

మేము ఓడిపోవడం అసంతృప్తి కలిగించింది. దీని నుంచి కుర్రాళ్లు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందుకే వీరిని ఇక్కడకు తీసుకొచ్చాం. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ చేజారింది. మా బ్యాట్స్ మన్ చెత్త షాట్లకు అవుటయ్యారు. ప్రాక్టీస్ లో ఇచ్చినట్టు క్యాచ్ లు ఇచ్చార'ని ధోని వివరించాడు. క్రితం రోజు జరిగిన తొలి టీ20 జరిగిన టీ20 మ్యాచ్ లో టీమిండియాను 2 పరుగుల తేడాతో జింబాబ్వే ఓడించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zimbabwe-India tour 2016  T20 series  Mahendra Singh Dhoni  BCCI  cricket  

Other Articles