India vs England 2016 Schedule: Complete Fixtures with Dates

Bcci announces dates for england tour of india

india vs england 2016, india vs england cricket 2016, india vs england cricket, india vs england schedule, india vs england series schedule, england vs india cricket, india vs england 2016 schedule, india vs england tour schedule

BCCI has announced the dates and venues for the upcoming home series against England that consists of five Tests, three ODIs and three Twenty20 matches

టీమిండియా.. ఇంగ్లాండ్ పర్యటన వివరాలు తెలుసా..?

Posted: 07/16/2016 04:34 PM IST
Bcci announces dates for england tour of india

వచ్చే నవంబర్ లో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తన భారత పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఇరు జట్ల ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా  ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ 20లు జరుగనున్నాయి.  ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) శుక్రవారం షెడ్యూల్ వివరాలను వెల్లడించింది.  తాజా షెడ్యూల్లో రాజ్ కోట్,  విశాఖలకు తొలిసారి టెస్టులకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కింది.
 
తొలి టెస్టు నవంబర్ 9 నుంచి 13 వరకూ రాజ్ కోట్లో జరుగుతుండగా, నవంబర్ 17 నుంచి 21 వరకూ రెండో టెస్టును విశాఖలో నిర్వహించనున్నారు. అయితే న్యూజిలాండ్ తో సిరీస్ సందర్భంగా నిర్వహించాలనుకున్న డే అండ్ నైట్ మ్యాచ్ను ఇంగ్లండ్తో సిరీస్లో కూడా పక్కనపెట్టేశారు. భారత్ లో ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ జరగడం దాదాపు మూడు దశాబ్దాల తరువాత ఇదే ప్రథమం. చివరిసారి 1984-85లో  ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ భారత్ లో జరిగింది.

ఇంగ్లండ్-భారత జట్ల షెడ్యూల్ వివరాలు..

నవంబర్ 9-13, తొలి టెస్టు మ్యాచ్, రాజ్ కోట్
నవంబర్ 17-21, రెండో టెస్టు మ్యాచ్, విశాఖపట్టణం
నవంబర్ 26-30, మూడో టెస్టు మ్యాచ్, మొహాలి
డిసెంబర్ 8-12, నాల్గో టెస్టు మ్యాచ్, ముంబై
డిసెంబర్ 16-20, ఐదో టెస్టు మ్యాచ్, చెన్నై

జనవరి 10, వన్డే వార్మప్ మ్యాచ్, ముంబై(సీసీఐ స్టేడియం)
జనవరి 12, రెండో వార్మప్ మ్యాచ్, ముంబై(సీసీఐ స్టేడియం)
జనవరి 15, తొలి వన్డే, పుణే
జనవరి 19, రెండో వన్డే, కటక్
జనవరి 22, మూడో వన్డే, కోల్ కతా

జనవరి 26, తొలి టీ 20, కాన్పూర్
జనవరి 29, రెండో టీ 20, నాగ్పూర్
ఫిబ్రవరి1, మూడో టీ 20, బెంగళూరు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  england  tour schedule  dates  bcci  cricket  

Other Articles