తల్లి కొడుకులు ఇద్దురు ఒకేసారి పత్రిపక్షాలపై విరుచుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠంపై అధిష్ఠింపచేయాలన్న పట్టుదలతో సర్వశక్తులను ధారపోస్తున్న సోనియాగాంధీ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ఎదుటివారిని గోతిలోకి తొయ్యాలని కుట్ర చేసే వారు తాము తీసుకున్న గోతిలో తామే పడతామన్న నిజాన్ని గ్రహించాలని ప్రతిపక్షాలకు ఆమె హితవుచెప్పారు. ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి తమ పార్టీ వైపు వేలెత్తి చూపడం మాని తమ సొంత ఇంటిని చక్కదిద్దుకుంటే మంచిదని సోనియా దెప్పిపొడిచారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, ఆర్థిక సంస్కరణలు వంటి వివిధ అంశాలను తెలియచేయటానికి ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో ఆమె ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేశారు. ప్రధాని మన్మోహన్‌కు మద్దతుగా నిలిచారు. ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం గడగడలాడిస్తున్న తరుణంలో కూడా దేశ ఆర్థిక వ్యవస్థ అతులాకుతలం కాకుండా మన్మోహన్ పరిరక్షించగలిగారని ఆమె ప్రశంసించారు. 2004, 2009లో ఘనవిజయం సాధించిన తమ పార్టీ ఈ ఎన్నికలలో కూడా విజయం సాధించగలదన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. ర్యాలీకి హాజరైన జనసందోహం తనకు కొత్త శక్తిని ఇస్తోందని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను పెకిలించటానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ఆమె ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలను బిజెపి స్తంభింపచేస్తూ ప్రజా సంక్షేమం కోసం తీసుకోవలసిన నిర్ణయాలకు అవరోధం కలిగిస్తోందని ఆమె ఆరోపించారు. ఏ అంశంపైనైనా చర్చించటానికి ప్రభుత్వం ముందుకు వచ్చినప్పటికీ ఆ పార్టీ భయపడి పారిపోతోందని సోనియా యద్దేవా చేశారు.
అవినీతిపై బిజెపి నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ ఆ పార్టీ అగ్రనేతలే ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయారని ఆమె బిజెపి అధ్యక్షుడు గడ్కరీ పేరు ప్రస్తావించకుండా ధ్వజమెత్తారు. అవినీతి కేన్సర్ వ్యాధి వంటిదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రుగ్మతను అదుపుచేయటానికి తమ పార్టీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అవినీతిని అదుపుచేయటానికి రూపొందించిన లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందకుండా రాజ్యసభలో అడ్డుపడిన ప్రతిపక్షాలు అవినీతిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆమె యద్దేవా చేశారు. పార్లమెంట్ శీతాకాలం సమావేశాలలో లోక్‌పాల్ బిల్లుకు చట్టబద్దత కల్పించేందుకు కృషి చేస్తామని ఆమె ప్రకటించారు. యుపిఏ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించిన నిజానిజాలు నెమ్మది నెమ్మదిగా బయట పడతాయని సోనియా చెప్పారు. కాంగ్రెస్ కారణంగా యుపిఏ ప్రభుత్వం ఇరుకున పడుతోందన్న వాదనతో ఆమె ఏకీభవించలేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆమె అన్నారు. పెట్టుబడులు పెరగటానికి ఈ ప్రక్రియ తప్పదని ఆమె స్పష్టం చేశారు. విదేశీ పెట్టుబడులు, ఆర్థిక సంస్కరణల వల్ల రైతాంగం, మధ్య తరగతి ప్రజలకు నష్టం జరిగే పరిస్థితి ఉంటే ప్రభుత్వం భేషజాలకు పోదని ఆమె కరాఖంఢిగా చెప్పారు. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందచేసే ఆహార ధాన్యాల ధరలను పెంచలేదని ఆమె గుర్తుచేశారు. లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షకు తమ పార్టీ కట్టుబడి ఉందని సోనియా స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more