Cm kiran new plans to politics

cm kiran kumar reddy, cm kiran new plan to political, kiran kumar reddy to political power, chief minister kiran kumareddy, kiran new plans in congress party, cm kiran meet to political leaders, kiran kumar reddy meet telangan leaders, Chief minister post, kiran to cheif minister post, cm kiran meet to center minsiter pallam raju, kiran meet to dasari narayana rao,

cm kiran new plans to politics

kiran.gif

Posted: 11/05/2012 12:55 PM IST
Cm kiran new plans to politics

cm kiran new plans to politics

రాష్ట్ర ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవి కాపాడుకునేందుకు తెర వెనుక మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తనను తప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై అప్రమత్తమయిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యర్ధులకు చెక్‌ చెప్పే వ్యూహా నికి తెరలేపారు. తెలంగాణ రెడ్డి నేతకు ముఖ్య మంత్రి పదవి ఇచ్చేందుకు నాయకత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించిందన్న వార్తల నేపథ్యంలో కిరణ్‌.. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతాన్ని అమలు చేసే ప్రణాళికను రూపొందించారు. ఫలితం గా తెలంగాణ ఎమ్మెల్యేలనే అందుకు అస్త్రంగా సంధించడం పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం... సూరజ్‌కుండ్‌ సమావేశంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులను మార్చేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం సూత్రప్రాయంగా నిర్ణయించి నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో శరవేగంగా జరుగుతున్న పరిణామాలను గ్రహించిన కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆ మేరకు తన పదవి కాపాడుకునేందుకు రంగంలో దిగారు. నిజానికి, కిరణ్‌ మరో ఒకటి రెండురోజులు ఢిల్లీలోనే ఉండాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో సంభవించిన తుపాను, వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ చర్యలు సమీక్షించవలసి ఉన్నందున, హఠాత్తుగా రాష్ట్రానికి తిరిగివచ్చారు.

cm kiran new plans to politics

కిరణ్‌ ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పటికీ, ఢిల్లీలో తనకు అనుకూలంగా లాబీయింగ్‌ చేసేందుకు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని తెరమీదకు తీసుకువచ్చారు. ఆయన దాదాపు 20 మంది తెలంగాణ ఎమ్మెల్యేలలతో ఢిల్లీ వెళ్లారు.కిరణ్‌ను మార్చి తెలంగాణకు చెందిన నేతకు పగ్గాలు అప్పగించవలసిన అవసరం ఏమీ లేదని, కిరణ్‌నే కొనసాగించాలని కోరేందుకే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి నాయకత్వంలోని ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం నాయకత్వాన్ని కోరేందుకే ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన నేతకు సీఎం పదవి కట్టబెట్టాలని నాయకత్వం యోచిస్తున్న సమయంలో.. అదే తెలంగాణ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చవలసిన అవసరం లేదని స్పష్టం చేయటం ద్వారా.. తనకు తెలంగాణలోనూ మద్దతు ఉందన్న సంకేతాలు ఇవ్వడమే సీఎం అసలు వ్యూహమని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. లేకపోతే అసలు మీడియాను పట్టించుకునే అలవాటు లేని నేపథ్యంలో వారిని ప్రత్యేకంగా పిలిపించి మరీ విందు ఏర్పాటుచేయడం వెనుక వారి అవసరాలే ఎక్కువ ఉన్నాయని స్పష్టమవుతోంది.పల్లంరాజుకు రాహుల్‌తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా, ఆయనను దాసరి నారాయణరావు ద్వారా రాహుల్‌పై ఒత్తిడి చేసే వ్యూహం రచించారని చెబుతున్నారు. రెండురోజుల క్రితం.. కిరణ్‌కు వ్యక్తిగతంగా కుటుంబ సాన్నిహిత్యం ఉన్న దాసరిని పల్లంరాజు కలిసిన విషయం తెలిసిందే. మర్యాదపూర్వక భేటీయేనని పల్లంరాజు చెప్పినప్పటికీ, కిరణ్‌ కోసం లాబీయింగ్‌ చేయాలని అభ్యర్ధించేందుకే దాసరి పల్లంరాజుతో భేటీ అయినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Narendra modi to win gujarat election again
Sonia gandhi fired on political parties  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more