Bengali film critical of mamata banerjee blocked by censor board

bengali,film,critical,mamata,banerjee,blocked,censor,board,bengal, comparing, dislodged, one-book, people, thought, commies, maoists, crushed, allegedly, fighter, single-handedly, claim, arundhoti, wrote, board, mamata, critical, banerjee, blocked, censor, count, bengali, saaar, dunno, woman, written, books, west bengal, suman mukhopadhyay, mamata banerjee, kangal malsat, kabir suman, central board of film certification

bengali film critical of mamata banerjee blocked by censor board

mamata-banerjee.gif

Posted: 02/26/2013 01:15 PM IST
Bengali film critical of mamata banerjee blocked by censor board

bengali film critical of mamata banerjee blocked by censor board

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదవీ ప్రమాణ స్వీకారం, ఆమె గతంలో నేతృత్వం వహించిన సింగూర్‌ ఉద్యమాలను వ్యంగ్యంగా చిత్రీకరించిన ఓ చలనచిత్రానికి క్లియరెన్స్‌ ఇచ్చేందుకు సెన్సార్‌ బోర్డు తిరస్కరించింది. ప్రముఖ సాహితీవేత్త మహాపాత్రా దేవి కుమారుడు నబరున్‌ భట్టాచార్య రచన ఆధారంగా సుమన్‌ ముఖోపాధ్యాయ దర్శకత్వంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ రెబల్‌ ఎంపి కథానాయకుడిగా నిర్మితమైన ఈ చిత్రం 'కంగల్‌ మల్సాత్‌' (పేదవాడి ఆర్తనాదం) ప్రజల్లో తిరుగుబాటును రెచ్చకొట్టేదిగా వుందని, అందువల్లే సెన్సార్‌ సర్టిఫికెట్‌ను నిరాకరిస్తున్నామని కేంద్ర ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ బోర్డు చిత్ర నిర్మాతలకు పంపిన లేఖలో వివరించింది. రాష్ట్రం నుండి టాటా గ్రూప్‌ నిష్క్రమణకు కారణమైన సింగూర్‌ ఉద్యమం వంటి సామాజిక ఉద్యమ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ చిత్రంలో చిత్రీకరించారని, అనవసరమైన, అసభ్య భాషను ఉపయోగించి సమాజంలో అనేక మంది ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారని సెన్సార్‌ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ చిత్రానికి రాజకీయ వివక్షతోనే ప్రభుత్వం సెన్సారింగ్‌ ఇబ్బందులు పెడుతున్నదని ఆరోపించిన చిత్ర దర్శకుడు సుమన్‌ ముఖోపాధ్యాయ సెన్సార్‌ బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు అప్పీలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సభ్యులతో కూడిన సెన్సార్‌ బోర్డు రివైజింగ్‌ కమిటీ సిఫార్సుల ఆధారంగా చిత్రం విడుదలకు సెన్సార్‌ బోర్డు నిరాకరించింది. సింగూరు నిరసనలపై తీసిన చిత్రాన్ని నిషేధించినందుకు వామపక్షాలు కూడా మమతా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. రాష్ట్రంలో సాంస్కృతిక రంగంలో ప్రజాస్వామ్యానికి చోటు లేకుండా పోతోందని వామపక్ష నాయకులు విమర్శించారు.

bengali film critical of mamata banerjee blocked by censor board

రాజకీయాల్లో ఎలాగూ ప్రజాస్వామ్యం గొంతు నులుముతున్నారు, దీని ప్రభావం సాంస్కృతిక రంగంపై కూడా పడుతుందని సిపిఎం నేత మహ్మద్‌ సలీమ్‌ అన్నారు. ముఖ్యమంత్రి మనోభావాలకు వ్యతిరేకంగా వున్నట్లైతే అది కార్టూన్‌ కానివ్వండి, లేదా ఇ మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌, ప్రసంగాలు, రాజకీయ నిరసనలు లేదా ఇతర ఏ రూపాలైనా సరే వాటికి అడ్డంకులు తప్పవని అన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి కబీర్‌ సుమన్‌ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సింగూరు సమస్య, మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం వంటి ప్రస్తావనలున్నాయంటూ కంగల్‌ మల్సాత్‌ సినిమాకు సెన్సార్‌ బోర్డు ఆమోద ముద్ర ఇవ్వకపోవడాన్ని ఆయన నిరసించారు.  సింగూరు గురించి అసలు అందులో ప్రస్తావన లేదన్నారు. చలన చిత్ర నిర్మాత సుమన్‌ ముఖోపాధ్యాయ కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. దీనిపై ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు వెళ్ళారు. ఒక నిర్మాతగా, పౌరుడిగా ఒక రాజకీయ సంఘటనకు సంబంధించి తన అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు తనకు వుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi pranathi desire to chief minister post
Chandra babu fire on cm kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more