చట్టాన్ని తయారు చేసే రాజకీయ నాయకులు చట్టాన్ని అమలుపరచే పోలీసు శాఖను నియంత్రిస్తూ వస్తున్నారు. చట్టాన్ని అమలు పరచే విభాగం దాన్ని రూపొందించే విభాగం కంటే ఎక్కువ అధికారాలను కలిగివుండలేదు కనుక రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకు తలవంచుతున్నారన్నది జగమెరిగిన సత్యం. ఇరు వర్గాల మధ్యా రాపిడి ఎప్పుడూ ఉండనే ఉంది. రాజకీయ నాయకులదేముంది ఎప్పుడుంటారో ఎప్పుడు పోతారో ఎంతకాలం రాజ్యం చేస్తారో తెలియని పరిస్థితి. కానీ మేము ఉద్యోగులుగా మా ఉద్యోగ కాలపరిమితంతా పనిచేస్తాము అంటారు ఉద్యోగులు. మేము ప్రజాప్రతినిధులం. ఎంత కాలమన్నా ఉండవచ్చు కానీ మమ్మల్ని నమ్మి ప్రాతినిధ్యాన్ని మాకు కట్టబెట్టిన ప్రజలకు న్యాయం చెయ్యటమే మా విధి. అందువలన మేము ఏది చెయ్యమని అంటే ప్రజాహితంలో మీరు అదే చెయ్యాలని వాదిస్తారు నాయకులు.
పంజాబ్ శాసన సభలో పోలీసులను వారి విధులను నెరవేర్చకుండా అడ్డుకున్నారంటూ నాలుగు రోజుల క్రితం కొందరు కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను ఒకరోజు కోసం సస్పెండ్ చెయ్యటంతో ఇది ఆగలేదు. నిన్న మంబై లో మహారాష్ట్ర శాసన సభలో స్వతంత్ర శాసన సభ్యుడు రామ్ కదమ్, క్షితిజ్ ఠాకుర్ మరో 15 మంది శాసన సభ్యుల మీద, శాసనసభలో విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిని అడ్డుకున్నారని, వారిమీద దాడి చేసారనే నేరం మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.
పోలీస్ ఇన్స్ పెక్టర్ సచిన్ సూర్యవంశీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, సూర్యవంశీ గుర్తు పట్టిన ఇద్దరు శాసన సభ్యుల రామ్ కదమ్, క్షితిజ్ ఠాకుర్లతో పాటు గుర్తించిన ఇతర సభ్యుల మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఇతరుల పేర్లు తెలియదు కానీ వాళ్ళని గుర్తుపడతానని ఇన్స్ పెక్టర్ చెప్పారు. మహారాష్ట్ర శాసన సభలో జరిగిన ఘటన మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ ఎవరైనా ఆఫీసర్ తప్పు చేస్తే అందుకు ప్రతిగా మరో తప్పు చెయ్యటం సరికాదని అన్నారు. ఇంతకీ ఆ నాయకులకు కోపం ఎందుకొచ్చిందో తెలుసా. రోడ్డు మీద స్పీడుగా పోనివ్వకుండా వాళ్ళని పోలీసు ఆఫీసర్ అడ్డుకున్నాడట. వాళ్ళ అధికారానికి మచ్చ వచ్చిందట. ఇప్పుడు పరువు మంట కలవటంలేదా అని అంటున్నారు మిగిలిన నాయకులు.
రాజకీయ నాయకులను అరెస్ట్ చేసినా ఏ ఆందోళనలోనో, రాస్తా రోకో లాంటి వాటిల్లోనో వాళ్ళని అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో తరలించినా, వాళ్లని ఆ ఘటనా స్థలానికి దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తారు. అలాంటి పెట్టీ కేసులను నాయకులు అసలు పట్టించుకోరు. కానీ వాళ్ళతో ఉన్నవాళ్ళు, అమాయకులైన కొందరు మద్దతుదార్లు మాత్రం అసలు నాయకులు అక్కడి నుంచి వెళ్ళిపోగానే పోలీసు కోపాన్ని రుచిచూస్తారు. అందుకే జైల్ భరో కార్యక్రమాన్ని కూడా సంతోషంగా చేస్తారు. అదే సామాన్య మానవుడి విషయంలో పోలీసు ఆగ్రహం అవధులు దాటుతుంది. అందరి వంతు అతనే తింటాడు. పోలీసులు కూడా తమ కోపాన్నంతా అమాయకంగా దొరికిపోయినవారి మీదనే తీర్చుకుంటారు.
ప్రజా ప్రతినిధినంటూ ప్రజలు ఎన్నుకున్నందువలన నాయకులైన వాళ్ళేమో పోలీసులను నియంత్రిస్తారు, అవసరమైతే నివారిస్తారు. కానీ వారిని ఎన్నుకున్న ప్రజలు మాత్రం పోలీసులంటే భయపడతారు, రామాయణంలో రాముని పేరు తలుచుకుని హనుమంతుడు సముద్రానే లంఘిస్తాడు, ఆ సముద్రాన్ని దాటటానికి రాముడు మాత్రం వారధి కట్టించుకుంటాడు అన్నట్టుంది.
అయితే పంజాబ్ లో సస్పెండ్ అయినవారు ప్రతిపక్ష నాయకులే కాక, పోలీసుల అతికి బలైన మహిళను శాసన సభలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినవారు, మహారాష్ట్ర లో శాసన సభ్యులు ప్రజా ప్రతినిధులే అయినా, స్వతంత్ర అభ్యర్థులు, ఎక్కువగా మద్దతు లేనివారు. అంటే, పోలీసులు రాజకీయ నాయకుల మీద చర్యలు తీసుకున్నట్టుగానే కనిపిస్తున్నా, అలా తీసుకోగలగటానికి శక్తివంతమైన రాజకీయ నాయకుల అండ, ప్రోద్బలాలు ఉండటమే కారణమని తేటతెల్లంగా ఉంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more