కర్నాటకలో కాంగ్రెస్ విజయం సాధించటంతో, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. కర్నాటకలో ఓడిపోయిన బిఎస్సార్ పార్టీతో పోల్చుతూ.. వైఎస్సార్ పార్టీ కూడా రాబోయో ఎన్నికల్లో ఓడిపోతుందని మీడియా ముందు గోల గోల చేశారు. అయితే కాంగ్రెస్ నాయకులు వైసీపీ నాయకురాలు శోభనాగి రెడ్డి కౌంటర్ వేశారు. ఆమె వేసిన కౌంటర్ కు కాంగ్రెస్ నాయకుల నోళ్లు మూతపడ్డాయి. అంటే ఆ సాహసం చేసే సత్తా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. సందట్లో సడేమియా లాగా తెలుగుదేశం పార్టీకి కూడా నాలుగు తగిలించారు. కర్నాటక ఎన్నికల ఫలితాలను చూసి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మురిసిపోతున్నాయని వైఎస్సార్ సిపి నేత శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని నమ్మకం ఉంటే కాంగ్రెస్, టిడిపిలు ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ చేశారు.
కర్నాటక ఎన్నికల ఫలితాలే రాష్ట్రంలో పునరావృతమవుతా యని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఆమె అన్నారు. కర్నాటకలో వచ్చిన ఫలితాలను చూస్తే అధికార బిజెపి ఓడిపోయినట్టు రాష్ట్రంలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని బొత్స భావిస్తున్నారా అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యంగా అవిశ్వాస తీర్మానంలో విప్‌ను ధిక్కరించిన పదిహేడు మంది ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయడం లేదని ఆమె ప్రశ్నించారు. ఒకవేళ అనర్హత వేటువేస్తే ఎన్నికలు వస్తాయన్న భయంతో ప్రభుత్వం జంకుతోందని ఆయన అన్నారు.
మధ్యంతర ఎన్నికలకు వెళితే ఏ పార్టీకి ప్రజల్లో విశ్వాసం ఉందో తెలుస్తుందని, అందుకు కాంగ్రెస్, టిడిపిలు సిద్ధమా అని ఆమె సవాల్ చేశారు. ప్రతి చిన్న అంశానికి స్పందించే చంద్రబాబు బొగ్గు కుంభకోణంపై సుప్రీం చేసిన వ్యాఖ్యలపై ఆయన ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. సిబిఐ వైఖరిపట్ల బాబు నోరు ఎందుకు మెదపడం లేదని ఆమె నిలదీశారు. అయితే ఆమె సవాల్ కాంగ్రెస్ పార్టీ , టీడీపీ పార్టీలో ఎలాంటి సమాధానం చెబుతాయో చూడాలి. పౌరుషనికి పోయి, ముందుగానే ఎన్నికల్లో తెస్తార్లో, లేక పదినిమిషాల్లో కళ్లు ముసుకోని ధ్యానం చేస్తూ, పవర్ తగ్గించుకొని సైలెంట్ గా ఉండిపోతారా చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more