మంచు కుటుంబం ఒక పెను ప్రమాదం నుండి బయట పడింది. అంటే కుటుంబం మొత్తం కాదులేండి? నటుడు డాక్టర్ మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు నటి, నిర్మాత మంచు లక్ష్మీప్రసన్న భారీ ప్రమాదం నుండి అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడింది. అయితే మంచు లక్ష్మీ ప్రసన్న గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇలాంటీ రిస్క్ జీవితంలో ఎవరు చేసి ఉండరు. ఎందుకంటే ఉన్నత కుటుంబం నుండి వచ్చి, ఇలాంటి జీవిత సాహాసం చేసిందంటే నిజంగా చాలా గ్రేట్ అంటున్నారు. ఇటీవల కాలంలో కోలీవుడ్ నటులు కొంతమంది షూటింగ్ కు వెళ్లి నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.
అయితే అలాంటి పరిస్థితే మన మంచు గారి అమ్మాయికి అనుభవం అయ్యింది. సమ్మర్ కాలంలో కేరళ అందాలను చూసి గుండెజారిపోతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లక్ష్మీప్రసన్న ప్రయాణిస్తున్న చిన్న బోటు బొల్తా పడటంతో ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని సుమారుగా కిలో మీటరు పాటు ఈదుకుంటు ఒడ్డుకు చేరుకుందని సమాచారం. కేరళలో జరిగిన ఈ సంఘటన గురించి ఆమె తన ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించింది. ‘కేరళలోని ఫేమస్ అలప్పుఝా లేక్‌లో మరో యాక్టర్‌తో కలిసి చిన్న బోటులో ప్రయాణిస్తూ ప్రక్రుతి అందాలను లక్ష్మీ ఆస్వాదిస్తుంది.
అయితే ఇంతలో అనుకోకుండా బోటు బోల్తా పడింది. లక్ష్మీ ప్రసన్న, తన తొటి వారు కూడా నీళ్లలో పడిపోయారు. నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. పడిపోయిన వారు ప్రాణ భయంతో ఆర్తనాధాలతో అరుపులు,కానీ వారికి సహాయం చెయ్యటానికి చుట్టు ఎవరు లేరు. అయితే అతి కష్టం మీద దాదాపు కిలో మీటర్ నీటిలో ఈదినట్లు మంచు లక్ష్మీ తెలిపింది. కానీ నీటిలో అసలు ఏం జరుగుతుందో లక్ష్మీ ప్రసన్నకు అర్థం కాలేదు. ఈ నదిలో చాలా పాములు కూడా ఉన్నట్లు లక్ష్మీ ఫ్రెండ్స్ చెబుతున్నారు. అయితే అటుగా వెళ్లుతున్న ఓ ఫిషింగ్ బోటు వారు వచ్చి అందరిని కాపాడటంతో ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ఆ బోటు వారు రాకపోతే మా పరిస్థితి ఊహించటానికే చాలా భయంకరంగా ఉందని లక్ష్మీ ప్రసన్న చెబుతుంది. లక్కీగా అందరికి ఈత వచ్చుకాబట్టి బతికిపోయాం. లేకపోతే పెద్ద ఘోరమే జరిగిపోయేదని ఆమె ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీప్రసన్న కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more